హిందీలో మహేశ్‌తో పోకిరి
మహేశ్‌బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవల విడుదలై ఇప్పటికి 150 రోజులు దాటినా ప్రేక్షకుల ఆదరణ అందుకుంటున్న సంచలన చిత్రం పోకిరి హిందీలో రీమేక్ అయ్యే అవకాశాలున్నాయని పూరీ జగన్నాథ్ చెబుతున్నారు. ఇడియట్ చిత్రం చూసినప్పటి నుంచి రామ్‌గోపాల్ వర్మ తమ ఫ్యాక్టరీ తరపున పూరీ జగన్‌తో కలిసి ఒక సినిమా చేసే ఆలోచన చేస్తున్నారు. అయితే, పోకిరి చూశాక ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని భావించారు. ఇందుకోసం వర్మ ఫ్యాక్టరీ పూరీని సంప్రదించడం, ఆయన అంగీకరించడం జరిగిపోయాయి. అయితే, పోకిరి హిందీ రీమేక్‌లో సైతం మహేశ్‌బాబు ఉండాలని, జాతీయస్థాయిలో రాణించగల సత్తా మహేశ్‌బాబులో పుష్కలంగా ఉందని వర్మ అభిప్రాయం. మహేశ్‌బాబు ఇంకా ఈ ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. ఆయన యస్ అంటే పోకిరి హిందీలో మహేశ్ హీరోగా రూపొందడం ఖాయం. ఇందుకు ఒక సంవత్సరం పడుతుందని దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటున్నారు. బహుశా వచ్చే యేడాది పోకిరి రీమేక్ చేయవచ్చన్నారాయన.


Click it and Unblock the Notifications











