twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా థియేటర్లో పార్కింగ్ ఫీజు వసూలు... అతడికి రూ. 50 వేలు కట్టమన్న కోర్టు!

    |

    తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం సినిమా థియేటర్లు, మాల్స్ వద్ద పార్కింగ్ ఫీజు ఎత్తి వేసిన సంగతి తెలిసిందే. వినియోగదారుల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేసిన థియేటర్‌ మీద ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో అతడినికి అనుకూలం తీర్పు ఇవ్వడంతో పాటు, వినియోగదారుడిని మానసిక క్షోభకు గురి చేసినందుకు రూ. 50 వేలు, కోర్టు ఖర్చుల కింద రూ. 5 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

    ఈ ఏడాది ప్రథమార్థంలో కాచిగూడ క్రాస్ రోడ్స్‌లోని మహేశ్వరి పరమేశ్వరి మాల్‍‌లో సినిమా చూసేందుకు విజయ్‌గోపాల్ అనే వ్యక్తి వెళ్లాడు. అతడి వద్ద నుండి రూ. 30 పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. అవినీతి వ్యతిరేకంగా ఫోరం అధ్యక్షకుడిగా ఉన్న విజయ్ గోపాల్.... తెలంగాణ పార్కింగ్ జీవోను ధిక్కరిస్తూ ఫీజు వసూలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ఈ కేసు విచారించిన కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

     Maheshwari Parmeshwari Mall fined for violating free parking rule

    ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి తెలంగాణ రాష్ట్రంలో మాల్స్, థియేటర్లలో పార్కింగ్ ఫీజును ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. పార్కింగ్ ఫీజు లేకుంటే అందరూ వచ్చి ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని, దానిని అరికట్టేందుకే పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యం వాదించింది. దీంతో థియేటర్‌లో సినిమా చూసినా, ఏదైనా కొనుగోలు చేసినా పార్కింగ్ ఫీజును తిరిగి ఇవ్వాలన్న నిబంధన విధించింది.

    అయితే నిబంధనలు ధిక్కరిస్తూ విజయ్‌గోపాల్ నుంచి వసూలు చేసిన ఫీజును వెనక్కి ఇవ్వకపోవడం అక్రమమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఈ మేరకు రూ. 50 వేల జరిమానాతో పాటు కోర్టు ఖర్చుల కింద అతడికి రూ. 5 వేలు చెల్లించాలని సూచించారు. నెల రోజుల్లోగా ఈ చెల్లింపు జరుగాలని, ఆలస్యం అయితే 7% వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది. తెలంగాణలో పార్కింగ్ జీవో అమలులోకి వచ్చిన తర్వాత ఇందుకు సంబంధించిన కేసులపై వెలువడిన తొలి తీర్పు ఇది. తన పోరాటానికి తగిన ఫలితం దక్కడంపై విజయ్ గోపాల్ ఆనందం వ్యక్తం చేశారు.

    English summary
    Maheshwari Parmeshwari Mall in Hyderabad has been directed to pay Rs 50,000 as compensation and Rs 5,000 has as fine for flouting free parking rules. Vijay Gopal, the complainant in the case, had visited the Maheshwari Parmeshwari Mall to watch a movie earlier this year when he was charged Rs 30 as parking charges.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X