వర్మ హీరోయిన్ ‘ముద్దు’ ముచ్చట్లు
రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న 'నాట్ ఎ లవ్ స్టోరీ" సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మహిగిల్ ముద్దు సీన్ల గురించి చాలా కబుర్లు చెబుతోంది. భావోద్వేగాలు వ్యక్త పరచడంలో ముద్దు సీన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని, మద్దు సీన్లు పండించడంలో పర్ ఫెక్ట్ గా ఉంటేనే నటనలో నవరసాలు పండించడంలో పరిణితి చెందినట్లు అని కొత్త బాష్యం చెబుతోంది.
మరో విషయం.. ఈ అమ్మడు షూటింగ్ లో పాల్గొన్న తొలి రోజే దర్శకులు ఆమెతో ముద్దు సీన్లు చేయించారట. ఈ విషయమై మహి గిల్ మాట్లాడుతూ...'తాను ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్నాను. రామూజీ దర్శకత్వంలో నాట్ లవ్ స్టోరీ తోపాటు, సాహెబ్ బివి జౌర్ గ్యాంగ్ స్టర్ సినిమాలు చేస్తున్నాను. నా కెరీర్‌లో తొలి సినిమా ఇవే. ఈ రెండు చిత్రాల్లోనూ ముద్దు సీన్లు ఎక్కువగా ఉంటాయని దర్శకులు ముందే చెప్పారు. రెండింటిలోనూ షూటింగ్‌లో పాల్గొన్న తొలి రోజే నాతో ముద్దు సీన్లు చేయించారు. తొలి రోజు కాబట్టి కాస్త కంగారు పడ్డా... కానీ తర్వాత అలవాటయి పోయింది" అంటూ ముద్దు ముచ్చట్లు ముద్దుముదుగా చెబుతోంది. అంతే కాదు దర్శకులనూ వెనకేసుకొస్తోంది. ముద్దు సీన్లను ఎరగా వేసి ప్రేక్షకులను రప్పించాలనేది వారి ఉద్దేశ్యం కాదు... సినిమా కథను రక్తి కట్టించేందుకే సందర్భానుసారంగా ముద్దు సీన్లు పెట్టారంటూః వారిని సమర్థిస్తోంది.
మహి అమ్మడు తొలి రోజుల్లోనే ఇలా ముద్దులతో రెచ్చి పోతోందంటే... ఈ రెండు సినిమాలు క్లిక్కయితే ఆమె జోరును ఆపడం సాధ్యం అవుతుందో లేదో..?


Click it and Unblock the Notifications











