సిద్దార్ధతో 'మహీ' పాంటసీ?

By Staff

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నే వద్దంటానా, కొంచెం ఇష్టం..కొంచెం కష్టం సినిమాల ద్వారా యూత్ లో తనకంటూ క్రేజ్ క్రియోట్ చేసుకున్న సిద్దార్ధ కొత్త చిత్రం ఈ రోజు(గురువారం)ప్రారంభమైంది. కె.రాఘవేంద్రరావు కుమారుడు కె.సూర్యప్రకాశ్ డైరక్షన్లో రానున్న ఈ చిత్రం ఓ ఫాంటసీ అని చిత్రం అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా దేవ్ డి తో పాపులర్ అయిన మహి గిల్ చేయనుందని సమాచారం. ఆ చిత్రంలో ఆమె పారూ గా మంచినటన చూపెట్టింది. ఆమెను తీసుకోవటం ద్వారా హిందీ మార్కెట్లో కూడా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుంది.

ఈ సందర్భంగా దర్శకుడు సూర్యప్రకాశ్ మాట్లాడుతూ..గత ఏడు సంవత్సరాలుగా నేనూ రాజమౌళి,నాలుగేళ్ళుగా క్రిష్ నేను నా స్క్రిప్టుల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం.నా స్క్రిప్టుతో అందరినీ మెప్పించగలననే నమ్మకం ఉంది. నాకిష్టమైన మా నాన్నగారి సినిమాలు అన్నమయ్య,జగదేక వీరుడు..అతిలోక సుందరి. వినోదాత్మక విలువల్లో జగదేకవీరుడు టాప్ అనిపిస్తుంది. అలాగే నేను డైరక్ట్ చేయబోయే ఈ చిత్రం కూడా ఫాంటసీ. సిద్దార్ధకి ఈ కథను నేరేట్ చేయగానే రెస్పాండ్ అయిన విధానం నచ్చింది. ఇన్నాళ్ళూ లవర్ బోయ్ స్టోరీలు చేస్తున్న సిద్దార్ధ ఈ చిత్రంతో తన ఇమేజ్ మార్చుకుంటాడు. అలాగే ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా వీడియో గేమ్స్,కామిక్ బుక్స్ రిలీజ్ చేస్తాం అన్నారు.

ఈ పంక్షన్ కి అటెండయిన గమ్యం దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ ప్రకాష్ స్ర్ర్రిప్టు రైటర్ గా టెర్రఫిక్ పర్శన్..అలాగే అతను నా గమ్యం, వేదం కథలకు సహకారం చేసాడు. అతని స్క్రిప్టులన్నీ చదివాను..అద్బుతమనిపించింది. ప్రకాశ్,సిద్దార్ధ కాంబినేషన్ వండర్స్ సృష్టిస్తుంది. కథలో హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి.కొద్దిగా ఫాంటసీ ఎలిమెంట్ ఉంది. సూర్య ప్రకాశ్ నెక్స్ట్ జెనరేషన్ దర్శకుడు అవుతాడని నేను గర్వంగా చెప్పగలను. అలాగే తెలుగు, హిందీ బాషల్లో రెడీ అవుతున్న ఈ చిత్రం భారతదేశంలో తయారయ్యే గొప్ప చిత్రమ అవుతుందని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X