మీరు మీ డబ్బు ఖర్చు పెట్టారు.. ఓకే: నెగిటివ్ ఫీడ్‌బ్యాక్‌పై ‘యాత్ర’ డైరెక్టర్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర' ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్డ్స్ టాక్ వినిపిస్తోంది. కొందరు ఈ సినిమా బావుందని, మరికొందరు బాగోలేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
తన సినిమాకు పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుండటంపై దర్శకుడు మహి వి రాఘవ్ స్పందించారు. ట్విట్టర్లో వస్తున్న కామెంట్లకు ఆయన ఓపికగా రిప్లై ఇచ్చారు. ఇలాంటి వస్తాయని ఊహించిన ఆయన తన సమాధానం ముందే సిద్ధం చేసి పెట్టుకున్నారు.

డబ్బు పెట్టి చూస్తున్న వారికి ఆ హక్కు ఉంది
ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టి ‘యాత్ర' సినిమా చూస్తున్నారో... వారందరికీ ఈ చిత్రంపై తమ అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉంది. మా సినిమా చూసిన వారందరికీ ధన్యవాదములు అంటూ మహి వి రాఘవ్ ట్వీట్ చేశారు.

నెగిటివ్, పాజిటివ్ రెండూ స్వీకరిస్తాం
‘యాత్ర' సినిమాపై వస్తున్న పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వినమ్రంగా, నిజాయితీగా స్వీకరిస్తాం. ఒక సినిమాపై అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండవని నా భావన... అంటూ యాత్ర దర్శకుడు తనదైన శైలిలో హుందాగా స్పందించారు.

వాటి గురించి బాధపడొద్దు అంటూ... ఫ్యాన్స్ మద్దతు
మహి వి రాఘవ్ చేసిన ట్వీట్‌పై కొందరు అభిమానులు స్పందించారు. సినిమాకు వస్తున్న నెగిటివ్ ఫీడ్ బ్యాక్ గురించి బాధ పడొద్దు... నిజంగా మూవీ చాలా బావుంది అంటూ దర్శకుడికి తమ మద్దతు ప్రకటించారు.

మూవీ టాక్ ఎలా ఉందంటే...
డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలోని ముఖ్య ఘట్టాలతో నిర్మించిన చిత్రం 'యాత్ర'. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటించారు. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించగా విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్లో నిర్మించారు. ఈ సినిమా ఎక్కువగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మమ్ముట్టి నటన సినిమాకు హైలెట్ అయిందని, ఈ చిత్రం తప్పకుండా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











