twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఫ్యాన్స్ యుద్ధం.. హృదయాలు గెలుచుకున్న దర్శకుడు!

    |

    దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో కీలక ఘట్టం పాదయాత్ర నేపథ్యంలో యాత్ర చిత్రం తెరకెక్కింది. మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న సమయంలో యాత్ర చిత్రం ఆసక్తి రేపుతోంది. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని మొదటి భాగం ఎన్టీఆర్ కథాయానాకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న యాత్ర చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య యుద్ధం జరుగుతోంది. దీనిపై దర్శకుడు మహి వి రాఘవ్ హుందాగా స్పందించి అందరి హృదయాలు గెలుచుకున్నాడు.

    సోషల్ మీడియా వార్

    సోషల్ మీడియా వార్

    సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో సినీ రాజకీయ ప్రముఖుల్ని అభిమానులు ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. మితీమీరిన అభిమానంతోనే సోషల్ మీడియాలో ఎవరో తెలియని వ్యక్తిని సైతం బూతులు తిట్టే పరిస్థితులు నెలకొంటున్నాయి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర చిత్రం రూపొందింది. శుక్రవారం ఈ చిత్ర విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది.

    ఎన్టీఆర్ బయోపిక్

    ఎన్టీఆర్ బయోపిక్

    యాత్ర చిత్రాన్ని ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో పోల్చుతూ కొందరు అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. మా నాయకుడే గొప్ప అంటే మా నాయకుడే గొప్ప అని ఎన్టీఆర్, వైఎస్ఆర్ అభిమానులు సోషల్ మీడియాలో దూషణలకు దిగుతున్నారు. దీనిపై యాత్ర దర్శకుడు మహి వి రాఘవ్ ఓ ప్రకటన చేసి తన హుందాతనాన్ని చాటుకున్నారు.

     మరో సినిమాతో పోల్చొద్దు

    మరో సినిమాతో పోల్చొద్దు

    గొప్ప నాయకుడు అయిన వైఎస్ఆర్ కథని చెప్పడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. వైఎస్ఆర్ కుటుంబం, అభిమానుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రాన్ని వైఎస్ఆర్ ప్రయాణంలా భావించి ఆస్వాదించండి. అంతే కానీ మరో చిత్రంతో పోల్చి రేస్ క్రియేట్ చేయొద్దు. ఈ చిత్రం కోసం చాలా మంది సాంకేతిక నిపుణులు కష్టపడి పనిచేసారు అని మహి రాఘవ్ తెలిపారు.

     ఇద్దరూ తెలుగు బిడ్డలే

    ఇద్దరూ తెలుగు బిడ్డలే

    ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ ఈ నేల తల్లి బిడ్డలే.. తెలుగు వారే. తెలుగు వారు గర్వించదగ్గ నాయకులు. మన మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ వారి గౌరవానికి భంగంకలిగే విధంగా ప్రవర్తించవద్దు అని రాఘవ్ అభిమానులని కోరాడు. నాకు వైఎస్ఆర్ఎం చిరంజీవి అంటే చాలా ఇష్టం. మనకు కొందరి వ్యక్తులపై ఇష్టం ఉండవచ్చు. అంత మాత్రాన మిగిలిన వారిపై ద్వేషం ఉండకూడదు అని మహి వి రాఘవ్ హితవు పలికారు. యాత్ర చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ప్రేక్షకులు ఎలాంటి స్పందన తెలియజేస్తారో అనే ఉత్కంఠ నెలకొని ఉందని మహి వి రాఘవ్ అన్నారు.

    English summary
    Mahi V Raghav emotional letter to YSR and NTR fans
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X