For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇది ముందే తెలిస్తే సినిమా తీసేవాడిని కాదు, భయం వేస్తోంది: ‘యాత్ర’ డైరెక్టర్ కామెంట్

|

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మహి వి రాఘవ్ తెరకెక్కించిన 'యాత్ర' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వస్తోంది. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి జీవించారని, ఆయన్ను తెరపై చూస్తుంటే ఆ రాజన్నే దిగివచ్చినట్లు ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై దర్శకుడు మహి వి రాఘవ్ స్పందించారు. భవిష్యత్తులో రూ. 50 కోట్లు, రూ. 100 కోట్ల సినిమా తీస్తానేమో... కానీ ఈ సినిమాకు వచ్చినంత అభిమానం వస్తుందని మాత్రం అనుకోవడం లేదు. కళకు వెలకట్టలేం. సినిమా చూసిన తర్వాత నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు. లక్షల్లో కాకపోయినా.. రెండు మూడు వేల మంది నాకు ఫోన్ చేసి మీ రుణం తీర్చుకోలేం అన్నారు. అంత పెద్ద మాట వద్దు అని చెప్పాను. వారి అభిమానం కన్నా విలువైంది ఏమీ లేదు. వారికి ఏం రిప్లై ఇవ్వాలో కూడా అర్థం కావడం లేదు అన్నారు.

రుణం అనే ఫీలింగ్ రావడం చాలా గొప్ప విషయం

నేను అనుకున్న కథ చెప్పాను. ఆ కథ వల్ల ఎదుటి మనిషికి ఆ స్థాయిలో గ్రేట్‌ఫుల్‌నెస్, రుణం అనే ఫీలింగ్ రావడం చాలా గొప్ప విషయం. నాకు తెలిసి నా జీవితంలో నాలుగైదు సినిమాలు చేయవచ్చు. అవి ఆడొచ్చు, ఆడకపోవచ్చు... కానీ ఈ సినిమాకు వచ్చినంత అభిమానం అయితే రాదు.

ఆ చిన్న సీన్ కూడా గుర్తు పెట్టుకున్నారు

సినిమా రాసేపుడు చాలా చిన్నచిన్న సంఘటనలు ఉన్నాయి. ప్రేక్షకులు వాటిని కూడా గుర్తు పెట్టుకుని చెప్పడం ఆనందంగా అనిపించింది. ఓ సీన్లో రాజశేఖర్ రెడ్డిగారు నడుచుకుంటూ వచ్చి చక్కర లేకుండా టీ ఇవ్వమని అడుగుతారు. రేటింగ్ బాగొచ్చిందనో, కలెక్షన్ల గురించి చెప్పినపుడు అంత ఆనందం అనిపించలేదు కానీ... ఆడియన్స్ అంత చిన్న విషయం కూడా గమనించేంత ఫోకస్డ్‌గా సినిమా చూశారనే ఫీలింగ్ చాలా గొప్పగా అనిపించింది.

10 ఏళ్ళు పీడించారు, వైఎస్ఆర్ మలుపు తిప్పారు.. 'యాత్ర'పై కొడాలినాని హాట్ కామెంట్స్!

సినిమా కలెక్షన్లపై...

కళను మనం సాధారణంగా కలెక్షన్లతో పోలుస్తాం. కానీ నాకు అలా పోల్చడం తెలియదు. రూ. 500 కోట్లు వచ్చిన సినిమా గొప్పనా? ‘3 ఇడియట్స్' గొప్పనా? అంటే నేను 3 ఇడియట్స్ గొప్ప అంటాను. నాకు సినిమాను ఎలా క్వాంటిఫై చేయాలో తెలియదు. ఇంకో సినిమా ఎప్పుడైనా బాగా కలెక్షన్స్ రావొచ్చు. కానీ నువ్వు పొందిన ప్రశంసలకు విలువ కట్టలేం. మనకు ప్రతిదీ డ్యూయల్ గా చూడటం అలవాటైంది. పదేళ్లు ప్రేమిస్తే ఓ ప్రేమ, 20 ఏళ్లు ప్రేమిస్తే ఓ ప్రేమ అని లెక్క వేయడం నాకు తెలియదు.

సీమ నుంచే కాదు.. తెలంగాణ నుంచి కూడా

నా సినిమా నేను బావుందని చెప్పడం కన్నా.. ఎవరో చూసి బావుంది అని మౌత్ టాక్ స్ప్రెడ్ చేయడం ఇంకా బావుంటుంది. ఈ సినిమాకు సీడెడ్లో ఎక్కువ ఆదరణ వస్తుందనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా నాకు నల్లగొండ, వరంగల్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మా రాజన్నను చూపించారు అని చెబుతున్నారు.

ఇది ముందే తెలిస్తే సినిమా తీసేవాడిని కాదు, భయం పట్టుకుంది

ఇంత అభిమానం ఉందని తెలిస్తే ఈ కథ చెప్పేవాన్ని కాదు. ఎందుకంటే నాకు అంతధైర్యం లేదు. ఇంత అభిమానం ఉందని నాకు ఇప్పుడు భయం పట్టుకుంది. ఇంత అభిమానం ఉందని తెలియక చేశాను. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్... అని మహి వి రాఘవ్ వ్యాఖ్యానించారు.

English summary
Mahi V Raghav superb words about Yatra movie. Yatra is an biographical film, based on life of Y. S. Rajasekhara Reddy, who served as Chief Minister of Andhra Pradesh from 2004 to June 2009 representing Indian National Congress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more