చైతూ సినిమా లో అదే హైలెట్, అదేంటో తెలుసా?
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా సవ్యసాచి. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది. తాజాగా డబ్బింగ్ వర్క్స్ పూర్తి చేసాడు నాగ చైతన్య. జూన్ 14న సినిమాను విడుదల చెయ్యాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం.
నాగచైతన్య సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతోంది. ప్రముఖ నటుడు మాధవన్ ఈ మూవీలో నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం విశేషం.

గతంలో ప్రేమమ్ మూవీతో నాగ చైతన్యకు చందు హిట్ ఇచ్చాడు.. తిరిగి ఈ క్యాంబినేషన్ లో మూవీ రూపొందనుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో వేసిన ఒక సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ మూవీలో ఒక టాప్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తోంది.సినిమాలో అదే హైలెట్ అంట. ఈ సాంగ్ లో నటించబోయే హీరోయిన్ ఎవరనేది త్వరలో తెలియనుంది.


Click it and Unblock the Notifications











