సల్మాన్ కేసు: కోర్టు కి దొరికిపోయింది ఈ పాయింటుకే
హైదరాబాద్ : తన తప్పు లేకపోతే 2002లో కారు ఢీ కొని ఒకరు మృతి చెందిన ఘటన ప్రాంతం నుంచి సల్మాన్ ఎందుకు వెళ్లిపోయినట్లని న్యాయస్థానం ప్రశ్నించింది. బుధవారం ఇచ్చిన తీర్పు కు సంబంధించిన 240 పేజీల ప్రతిలో ఈ విషయం ఉంది. పై కారణం వల్లే డిఫెన్స్ లాయర్ వాదనల్ని తాము నమ్మలేకపోయామని స్పష్టం చేసింది. సల్మాన్ తప్పు చేయకపోయి ఉంటే తాను సంఘటన స్థలంలోనే ఉండి ఉండేవాడనే అభిప్రాయాన్ని న్యాయస్థానం వ్యక్తంచేసింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, నిర్లక్ష్యపూరితంగా, మద్యపానం చేసి వాహనం నడపటం, ఆస్తులకు నష్టం కలిగించటం, ఇతరులు తీవ్రంగా గాయపడేలా ప్రవర్తించటం తదితర ఆరోపణలను కూడా న్యాయమూర్తి ధ్రువీకరిస్తూ సంబంధిత సెక్షన్ల కింద శిక్షను ఖరారు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో తన డ్రైవర్ అశోక్‌సింగ్ కారు నడుపుతున్నారన్న సల్మాన్ వాదనను జడ్జి దేశ్‌పాండే తిరస్కరించారు.
క్యూ కట్టారు: సల్మాన్ ఖాన్‌కు పరామర్శల వెల్లువ
''నాడు మీరు మద్యం తాగారు. మీరే వాహనం నడిపారు. ఘటనస్థలం నుంచి కారును క్రేన్ తొలగిస్తున్నప్పుడు కారు కిందపడి వ్యక్తి మరణించారంటూ మీరు చెప్పిన దానిని నేను అంగీకరించటం లేదు'' అని దేశ్‌పాండే స్పష్టం చేశారు. అనంతరం ఈ కేసులో ఐదేళ్ల జైలుశిక్షను విధిస్తున్నానని, సల్మాన్‌ను తక్షణం అరెస్టు చేయాలంటూ తీర్పు చెప్పారు.

ఈ సందర్భంగా సల్మాన్‌ఖాన్ కన్నీటిపర్యంతమయ్యారు. ''నేను కారు నడపలేదు. కానీ మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. అంగీకరిస్తున్నా. నా న్యాయవాది నా తరఫున మాట్లాడతారు'' అని సల్మాన్ పేర్కొన్నారు.
2002 నాటి కేసుపై సెషన్స్‌కోర్టు న్యాయమూర్తి డిడబ్ల్యూ దేశ్‌పాండే బుధవారం తీర్పును వెలువరించారు. ముంబయి శివార్లలోని బాంద్రాలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బేకరీ బయట నిద్రిస్తున్న వారిపైకి సల్మాన్‌ఖాన్ తన కారును తీసుకెళ్లారని నిర్ధరించారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో సల్మాన్‌ఖాన్ ఎదుర్కొన్న దోషపూరిత నరహత్య ఆరోపణను జడ్జి ధ్రువీకరించారు. దీనికింద గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం ఉన్నప్పటికీ న్యాయమూర్తి ఐదేళ్ల కఠిన జైలుశిక్ష విధించారు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ సల్మాన్‌ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించటంతో.. హైకోర్టు ఆయనకు రెండురోజుల తాత్కాలిక బెయిల్‌ను ఇచ్చింది. కేసుపై శుక్రవారం విచారణ జరుపుతామని పేర్కొంది.


Click it and Unblock the Notifications











