‘మైనే ప్యార్ కియా’ సెన్సార్ రిపోర్ట్

By Bojja Kumar

హైదరాబాద్: ప్రదీప్, ఇషా తల్వార్ జంటగా నటించిన 'మైనే ప్యార్ కియా' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ప్రదీప్ మాడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యునిఫై క్రియేషన్స్ పతాకంపై
సానా వెంకటరావు నిర్మించారు. ఉపేంద్ర, వెన్నెల రామారావు సహ నిర్మాతలు.

ఈ చిత్రం ఐ.టి కంపెనీ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. ఒకే కంపెనీ లో పని చేస్తున్న ఒక యువ జంట మధ్య ప్రేమ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్ర కథకీ, పాత హిందీ చిత్రం "మైనే ప్యార్ కియా" ఎటువంటి సంబంధం లేదు. ఈ చిత్రం వినూత్నమైన ప్రేమకథా చిత్రంగా, పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌తో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని నిర్మాత తెలిపారు.

Maine Pyaar Kiya gets U/A certificate

సినిమా గురించి యూనిట్ సభ్యులు వెల్లడిస్తూ...'మైనే ప్యార్ కియా' చిత్రం సెన్సాన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈనెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాం' అన్నారు.

ముఖ్య పాత్రల్లో కోమల్ ఝూ, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, వెన్నెల రామారావు, వైవ హర్ష, వేణు, శివన్నారాయణ, ఉత్తేజ్, మధుమిత, సత్యదేవ్, కోటేశ్వరరావు, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్ కుమార్, సినిమాటోగ్రఫీ: ఎస్.వి. విశ్వా, నిర్మాతలు: సానా వెంకటరావు, ఉపేంద్రకుమార్ గిరడ, దర్శకత్వం: ప్రదీప్ మాడుగుల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X