రెండు తరాల ప్రేమ... (‘మైనే ప్యార్ కియా’ప్రివ్యూ)
హైదరాబాద్: అప్పట్లో ఇదే టైటిల్ తో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన చిత్రం పెద్ద సంచలనం. మళ్లీ ఇప్పుడు బిల్లా రంగా చిత్రంతో పరిచయమైన దర్శకుడు ప్రదీప్ మాడుగల ఇదే టైటిల్ తో ముందుకు వస్తున్నారు. మొదటి చిత్రం ఆకట్టుకోకపోయినా ఈ రెండో చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. రెండు తరాల మధ్య భేదాన్ని చూపించే ప్రేమకథ ఈ చిత్రాన్నిదర్శకుడు మలిచినట్లు నిర్మాతలు చెప్తున్నారు.
ఈ కథ నవీన్(ప్రదీప్), షాలిని(ఇషా తల్వార్) మధ్య జరుగుతుంది. ఇద్దరూ బాల్య స్నేహితులు. అయితే చిన్నప్పుడే విడిపోయిన వీరు చాలా కాలం తర్వాత ఓ ఐటీ ఫర్మ్ లో కలుసుంటారు. అప్పుడు నవీన్..షాలినీతో డీప్ గా ప్రేమలో మునిగిఉంటాడు. అయితే అతను గతంలో చేసిన ఓ పొరపాటు వీరి మధ్య విభేధాలు తెస్తుంది. అక్కడ నుంచి కథ టర్న్ తీసుకుంటుంది. తర్వాత ఎలా వీరిద్దరూ ఎలా కలిసారు అన్న ఈ కథలో... సమాజం క్రమేణా ఎలా మారుతోంది..ప్రేమ, పెళ్లి వంటి విషయాల్లో తన అభిప్రాయాలను ఎలా మార్చుకుంటోంది అనే విషయాలు ఈ చిత్రంలో చర్చించారు.

హీరోయిన్ ఇషా తల్వార్ మాట్లాడుతూ.... 'రెండు తరాల మధ్య భేదాన్ని చూపించే ప్రేమకథ ఈ చిత్రం. నేను నేటి తరానికి ప్రతినిధిగా కనిపిస్తున్నాను. నా నటన, పాత్ర తీరు అందరికీ నచ్చుతాయి. సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. 'పక్కింటి అమ్మాయి లాంటి పాత్ర నాది. మరోవైపు 15 ఏళ్ల క్రితం మరో జంటకు మధ్య సాగే కథ కూడా ఇందులో ఉంటుంది. ఈ రెండు ప్రేమల మధ్య వ్యత్యాసాన్ని అంతర్లీనంగా చూపిస్తున్నారు దర్శకుడు ప్రదీప్'' అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.... ఓ సరికొత్త మోడరన్ లవ్‌స్టోరీతో అందరికీ నచ్చే కథనంతో ఈ చిత్రం సాగుతుందని, బ్యూటిఫుల్ రొమాంటిక్ చిత్రంగా అందరికీ నచ్చుతుందని, మొదటినుండి చివరివరకు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి, సంతోషిస్తారని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ... అలనాటి ప్రేమకి, నేటి ప్రేమకి మధ్య ఎటువంటి తేడా ఉంది? అనే కథనంతో తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని, పాటలన్నీ రికార్డింగ్ కార్యక్రమాలు బోస్టన్‌లో చేశామని, నేపథ్య సంగీతం చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని దర్శకుడు ప్రదీప్ మాడుగుల తెలిపారు.
బ్యానర్: యూనిఫై క్రియేషన్స్
చిత్రం: మైనే ప్యార్ కియా
నటీనటులు: ప్రదీప్, ఇషా తల్వార్, కోమల్ ఝూ, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, వెన్నెల రామారావు, వైవ హర్ష, వేణు, శివన్నారాయణ, ఉత్తేజ్, మధుమిత, సత్యదేవ్, కోటేశ్వరరావు, సోలో ఫేం స్వప్నిక, సుధాకర్ వర్మ, కత్తి మహేష్, కుమార్ తేజ, సర్వమంగళ, ల్యాబ్ శరత్, ముద్దమందారం ప్రదీప్, సరస్వతి, సురేష్, ప్రాచీ తదితరులు
సంగీతం: ప్రదీప్‌కుమార్ వి,
కెమెరా: ఎస్.వి.విశ్వ,
నిర్మాతలు: సానా వెంకట్‌రావు, ఉపేంద్రకుమార్ బిరడ,
దర్శకత్వం: ప్రదీప్ మాడుగుల.
విడుదల తేదీ: 20,జూన్ 2014.


Click it and Unblock the Notifications











