మైనే ప్యార్ కియా ఆడియో, బర్నింగ్ స్టార్ సందడి (ఫోటోలు)
హైదరాబాద్: ప్రదీప్, ఇషా తల్వార్ జంటగా నటించిన 'మైనే ప్యార్ కియా' ఆడియో వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ప్రదీప్ మాడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యునిఫై క్రియేషన్స్ పతాకంపై సానా వెంకటరావు నిర్మించారు. ఉపేంద్ర, వెన్నెల రామారావు సహ నిర్మాతలు.
ఈ చిత్రం ఆడియో వేడుకకు ప్రముఖ దర్శకుడు సంపత్ నంది, మధుర శ్రీధర్, శివబాలాజీ, సురేష్ కొండేటి, ఎన్వీ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యాను. తొలిసీడీని సంపత్ నంది విడుదల చేసి మధుర శ్రీధర్‌కు అందించారు. శివబాలాజీ, సురేష్ కొండేటి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ వేడుకకు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా హాజరయ్యాడు.
ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు, మరిన్ని వివరాలు స్లైడ్ షోలో.......

హీరో మాట్లాడుతూ..
ప్రేమలోని కొత్తకోణాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. అందరికీ నచ్చే విధంగా సినిమా ఉంటుందని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ..
నిర్మాత రామారావుగారి కారణంగానే సినిమా ఈ స్టేజికి వచ్చింది. ఆయనతో నాకు ఐదేళ్ల పరిచయం ఉంది. సంగీత దర్శకుడు ప్రదీప్ మంచి సంగీతాన్ని ఇచ్చారు అన్నారు.

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ...
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ... పాతికేళ్ల క్రితం మైనే ప్యార్ కియా సినిమా వచ్చింది. ఆ సినిమా పుట్టినపుడు నేను పుట్టాను. ఇపుడు మరో మైనే ప్యార్ కియా విడుదలవుతోంది. ఇపుడు నా‘హృదయ కాలేయం' చిత్రం విడుదల అవుతోంది అన్నారు.

సంపత్ నంది మాట్లాడుతూ...
ఈ చిత్రం నిర్మాత మంచి అభిరుచి గల నిర్మాత. ఈ చిత్రం భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ..
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ....మైనే ప్యార్ కియా నా ఫేవరెట్ సినిమా. అప్పట్లో అది చాలా పెద్ద హిట్ సినిమా. ఈ సినిమా కూడా అంతే సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

సంగీత దర్శకుడు మాట్లాడుతూ...
సంగీత దర్శకుడు ప్రదీప్ మాట్లాడుతూ...సినిమా కాన్సెప్టు చాలా బాగుంది. అందుకు తగిన విధంగానే ట్యూన్స్ ఇచ్చాను. పాటలు అందరికీ నచ్చుతాయని భావిస్తున్నాను అన్నారు.

ఆ సినిమాతో సంబంధం లేదు
ఈ చిత్ర కథకీ, పాత్ర హిందీ చిత్రం "మైనే ప్యార్ కియా" ఎటువంటి సంబంధం లేదు. ఈ చిత్రం వినూత్నమైన ప్రేమకథా చిత్రంగా, పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌తో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని నిర్మాత తెలిపారు.

నటీనటులు
ప్రదీప్, ఇషా తల్వార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కోమల్ ఝూ, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, వెన్నెల రామారావు, వైవ హర్ష, వేణు, శివన్నారాయణ, ఉత్తేజ్, మధుమిత, సత్యదేవ్, కోటేశ్వరరావు, సోలో ఫేం స్వప్నిక, సుధాకర్ వర్మ, కత్తి మహేష్, కుమార్ తేజ, సర్వమంగళ, ల్యాబ్ శరత్, ముద్దమందారం ప్రదీప్, సరస్వతి, సురేష్, ప్రాచీ తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక విభాగం
ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్ కుమార్ వి, సినిమాటోగ్రఫీ: ఎస్.వి.విశ్వా, నిర్మాతలు: సానా వెంకటరావు, ఉపేందర్ కుమార్ గిరడ, దర్శకత్వం: ప్రదీప్ మాడుగుల.


Click it and Unblock the Notifications