సస్పెన్స్ థ్రిల్లర్ 'మైత్రి' వచ్చేస్తోంది
హైదరాబాద్: నవదీప్, సదా జంటగా, సూర్యరాజు కథ దర్శకత్వాన వాసు క్రియేషన్స్ పతాకంపై సుభద్ర సమర్పణలో నిర్మాత రాజేష్ కుమార్ నిర్మించిన మైత్రి చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ నెలలోనే విడుదలకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఆడియో ఈ మధ్యనే విడులై సంగీత ప్రియుల ఆదరణను చూరగొంది.
చిత్ర దర్శకుడు సూర్యరాజు ఆడియో గురించి మాట్లాడుతూ - మొత్తం ఐదు పాటలతో కూడిన తమ మైత్రి ఆడియోకి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, విడదలైన తొలి బ్యాచికి అన్ని చొట్ల నుంచి మంచి రిపోర్టు వచ్చిందని చెప్పాచరు. ఈ నెల 10వ తేదీన రెండో బ్యాచినీ తమ హను మ్యూజిక్ సంస్థ సంస్థ మార్కెట్ చేయబోతోందని, ముఖ్యంగా ఇందులోని మేడిన్ ఇండియా అంటూ సాహిత్య సాగర్ రాసిన పాటకు అన్ని చోట్ల నుంచి మంచి స్పందన లభించిందని వివరించారు. దీన్ని తమ చిత్రం సాధించిన తొలి విజయంగా భావిస్తున్నామని అన్నారు.
ప్రపంచ దేశాల్లో మన భారతదేశం గొప్పతనం గురించి, మన కట్టుబాట్లు, వ్యవహారశైలి, విలువల గురించి ఈ పాట ద్వారా చెప్పినట్లు తెలిపారు. ఈ పాటను గీతామాధురి, వికాస్, రఘురామ్, ధనుంజయ్‌లు పాడారు. అలాగే రామజోగయ్య శాస్త్రి రాసిన నింగిలోని నీలిమేఘం అంటూ సాగిన పాటకు కూడా మంచి స్పందన వచ్చిందని సూర్యరాజు చెప్పారు.
అక్టోబర్ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. ఈ చిత్రపరంగా నిర్మాత రాజేష్ కుమార్, సహ నిర్మాత కుమార్ రాజాలు తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, మంచి సినిమాను చేసేందుకు సహకరించారని, వారిచ్చిన పూర్తి సహకారంతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించామని అన్నారు. అక్టోబర్ 20 తేదీకి చిత్రం ఫస్ట్ కాపీ వస్తుందని చెప్పారు.
నటీనటులు: నవదీప్ - సదా జంటగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఉత్తేజ్, చిత్రం శ్రీను, భిక్షు, కళ్లు చిదంబరం, సత్యం రాజేష్, అర్జున్, లక్ష్మణ్, పాపారాయుడు, వంశీ, కీర్తి నటించారు.
సాంకేతిక నిపుణులు:
సంగీతం - వికాస్, పాటలు - రామజోగయ్య శాస్త్రి, శ్రేష్ఠ, ఎడిటింగ్ - వినయ్, కెమెరా - జి సెల్వకుమార్, మేకప్ - నాయుడు, కాస్ట్యూమ్స్ - నరసింహ, ఆర్ట్ - విజయ్ కృష్ణ.


Click it and Unblock the Notifications











