Don't Miss!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- News వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దికి సతీమణి షాక్ - రెబల్ గా బరిలోకి..!!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
తెలుగు రాష్ట్రాలను 50 రోజుల పాటు చుట్టేసిన చై సామ్.. ఇదీ విషయం
అక్కినేని నాగచైతన్య, సమంత 50 రోజుల ప్రయాణం పూర్తిచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వారి జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగింది. అర్థం కాలేదా? అదేనండీ నాగచైతన్య, సమంత వెండితెర ప్రయాణం. పెళ్లి తర్వాత మజిలీ రూపంలో మొదటిసారి జోడీ కట్టిన చై సామ్ విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకున్నారు. ఏప్రిల్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా నిన్నటితో 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా వారి 50 రోజుల ప్రయాణాన్ని గుర్తుచేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు యూనిట్ సభ్యులు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ పంచుకున్న చిత్రయూనిట్.. మజిలీ 50 డేస్ పూర్తిచేసుకుంది. మీరు చూపించిన ప్రేమ, అభిమానానికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పోస్టర్ విడుదల చేశారు. 25 సెంటర్లలో మజిలీ ప్రయాణం 50 రోజుల పాటు విజయవంతంగా సాగిందని ఈ పోస్టర్ ద్వారా తెలిపారు. సాలిడ్ బ్లాక్ బస్టర్ సినిమాగా హిట్ సాధించిన మజిలీ నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది, సుశీల్ చౌదరి తెరకెక్కించారు. చిత్రంలో అక్కినేని నాగచైతన్య సరసన సమంత ఆడిపాడగా.. దివ్యాంశ కౌశిక్ అనే మరో హీరోయిన్ చైతుతో రొమాన్స్ చేసింది. చిత్రంలో పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, అతుల్ కులకర్ణి, రావు రమేష్, అవసరాల శ్రీనివాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
చిత్రంలో సమంత, నాగ చైతన్య మధ్య చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ గుండెలు పిండేశాయి. పెళ్లి తర్వాత మొదటిసారి ఓకే సినిమాలో నటించిన ఈ జంటకు మంచి డిమాండ్ ఏర్పడింది. చైతూ, సమంతతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. ఫన్, రొమాన్స్, ఎమోషన్ అన్నీ కలగలిపిన మజిలీ ప్రయాణం తెలుగు సినిమా చరిత్రలో చెప్పుకోదగిందే.