డైరెక్టర్‌తో గొడవ, అతడి మాటలకు షాక్.. తమన్ లేకుంటే పరిస్థితి ఏంటి!
సమంత, నాగ చైతన్య జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మజిలీ. పెళ్ళైన తర్వాత చైతు, సమంత కలసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే. దీనితో మజిలీపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మజిలీ చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఓ దశలో మజిలీ చిత్రం అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అందుకు కారణం ఈ చిత్ర సంగీత దర్శకుడు గోపి సుందర్ అంటూ ప్రచారం జరుగుతోంది.

మధ్యలో తప్పుకుని
మజిలీ చిత్రానికి సంగీత దర్శకుడు గోపిసుందర్. ఈ చిత్రంలోని కొన్ని పాటలు ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతా బాగానే జరుగుతుంది అనుకుంటున్న సమయంలో గోపిసుందర్ ఈ చిత్రం నుంచి తప్పుకుని ఊహించని షాక్ ఇచ్చాడు. మజిలీ రీరికార్డింగ్ కు సిద్ధం అవుతున్న సమయంలో గోపిసుందర్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఈ సంఘటన గురించి ఇప్పుడిప్పుడే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

డైరెక్టర్‌తో గొడవ
దర్శకుడు శివ నిర్వాణ, గోపిసుందర్ మధ్య విభేదాలు తలెత్తాయట. దీనితో గోపిసుందర్ ఈ చిత్రానికి పని చేయడానికి ఆసక్తి చూపలేదని వార్తలు వస్తున్నాయి. మజిలీ షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత దర్శకుడు రీరికార్డింగ్ పనులు మొదలుపెట్టాడు. బ్యాగ్రౌండ్ కోసం గోపిసుందర్ ని అడగగా తనకు కొంత సమయం కావాలని, సినిమాని వాయిదా వేయమని చెప్పాడట. అతడి మాటలకు దర్శకుడు షాక్ అయినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో మజిలీ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో వాయిదా వేయడం సరికాదని శివ భావించినట్లు తెలుస్తోంది.

తమన్ లేకుంటే
బ్యాగ్రౌండ్ సంగీతం కోసం శివ తమన్ ని రిక్వస్ట్ చేయగా అతడు ఒకే చెప్పాడు. తమన్ ఒప్పుకోకుంటే మజిలీ చిత్రం వాయిదా పడేదని అంటున్నారు. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శివ, నాగ చైతన్య తమన్ పై ప్రశంసలు కురిపించారు. తమన్ బ్యాగ్రౌండ్ సంగీతంతో మజిలీ స్థాయి పెరిగిందని శివ అన్నాడు. తమన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని, ప్రాణం పోశాడని చైతు ప్రశంసించాడు.

ఎలాంటి అడ్డంకులు లేకుండా
మజిలీ చిత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య ఎమోషనల్ పెర్ఫామెన్స్ అందరిని ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపాడు. నాగ చైతన్య ఈ చిత్రంలో రెండు షేడ్స్ లో నటిస్తున్నాడు. ప్రేమలో విహరించే యువకుడిగా, ఆ తర్వాత సమంతకు భర్తగా కనిపిస్తున్నాడు. ఏ మాయ చేశావే, మనం చిత్రాల్లో సమంత, చైతు మ్యాజిక్ పనిచేసింది. మజిలీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











