twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైతు వరుస ప్లాపులు.. మజిలీ ప్రీరిలీజ్ బిజినెస్‌పై ఎఫెక్ట్, ఆ రెండు చిత్రాలకంటే!

    |

    Recommended Video

    Majili Film Fails To Beat Records of Savyasachi Theatrical Rights || Naga Chaitanya || Samantha

    సమంత, నాగ చైతన్య జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మజిలీ. పెళ్ళైన తర్వాత చైతు, సమంత కలసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే. దీనితో మజిలీపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సమంత, చైతు జోడికి ఉన్న క్రేజ్ తో మజిలీ చిత్రానికి భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంతా భావించారు. కానీ నాగ చైతన్య గత చిత్రాల కంటే తక్కువ ధరకే మజిలీ ప్రీరిలీజ్ బిజినెస్ ముగిసింది.

    ఫ్యామిలీ ఎంటర్టైనర్

    ఫ్యామిలీ ఎంటర్టైనర్

    మజిలీ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఏప్రిల్ 5న విడుదలకు మజిలీ చిత్రం అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. చైతు, సమంత కాంబినేషన్ లో గతంలో కొన్ని విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఆ క్రేజ్ తో మజిలీ చిత్రానికి కూడా మంచి డిమాండ్ ఉంటుందని భావించారు. కానీ మజిలీ ప్రీరిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాక అసలు విషయం తెలిసింది. నాగ చైతన్య గత చిత్రాల కంటే ఎక్కువ మొత్తంలో ధర వెచ్చించి మజిలీ హక్కులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

    ప్రీరిలీజ్ బిజినెస్

    ప్రీరిలీజ్ బిజినెస్

    ప్రపంచ వ్యాప్తంగా మజిలీ చిత్ర థియేట్రికల్ హక్కులు 21.14 కోట్లకు అమ్ముడయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మజిలీ చిత్రానికి 16.64 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ హక్కులు 3 కోట్లకు, ఇండియాలోని ఇతర ప్రాంతాల హక్కులు 1.5 కోట్లకు అమ్ముడయ్యాయి. నాగ చైతన్య గత చిత్రాలకంటే మజిలీ ప్రీరిలీజ్ బిజినెస్ తక్కువగా జరిగింది. శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి 24 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. సవ్యసాచి చిత్ర థియేట్రికల్ హక్కుల విలువ 22.5 కోట్లు.

    ప్లాపుల ఎఫెక్ట్

    ప్లాపుల ఎఫెక్ట్

    నాగ చైతన్యకు ఇటీవల సరైన విజయం లేదు. ఆ ప్రభావమే మజిలీ ప్రీరిలీజ్ బిజినెస్ పై పడింది. శైలజారెడ్డి అల్లుడు యావరేజ్ గా నిలిచింది. సవ్యసాచి చిత్రం నిరాశపరిచింది. దీనితో బయ్యర్లు సేఫ్ గా ఉండే ధరకే మజిలీ చిత్రాన్ని కొనుగోలు చేసుకున్నారు. సమంత క్రేజ్ కూడా మజిలీ ప్రీరిలీజ్ బిజినెస్ కు ఉపయోగపడలేదు. షైన్ స్క్రీన్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

     హిట్ అనిపించుకోవాలంటే

    హిట్ అనిపించుకోవాలంటే

    మజిలీ చిత్రం హిట్ అనిపించుకోవాలంటే 21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలి. ఎలక్షన్ హడావిడిలో మజిలీ విడుదలవుతుండడంతో కలెక్షన్లు ఎలా ఉంటాయో వేచి చూడాలి. నాగ చైతన్యకు మజిలీ చిత్రం విజయం సాధించడం చాలా కీలకం. రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత చైతూకు ఆ స్థాయి విజయం దక్కలేదు.

    English summary
    Majili pre-release business: Naga Chaitanya film fails to beat records of Savyasachi rights. Shiva Nirvana is the director of Majili. Rao Ramesh and Posani playing key roles in Majili
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X