భారతీయుడు 2 షూటింగ్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి.. కన్నీరు పెట్టుకున్న కమల్

Recommended Video

#Indian2 Sets Video : Kamal Haasan's 'Bharateeyudu 2' Sets Crane Mishap | Filmibeat Telugu

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్ జరుగుతుండగా భారీ క్రేన్ విరిగిపడటంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో పదికి గాయాలయ్యాయి. డైరెక్టర్ కూడా గాయపడ్డారు. ఈ ఘటనతో తమిళ సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.

 చెన్నైలో షూటింగ్.. లైటింగ్ కోసం భారీ క్రేన్స్

చెన్నైలో షూటింగ్.. లైటింగ్ కోసం భారీ క్రేన్స్

ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా షూటింగ్‌ చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతోంది. ఈ మేరకు లైటింగ్ కోసం భారీ క్రేన్స్ సహాయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి క్రింద ఉన్న టెంట్‌పై పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

 ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి..

ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి..

ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్‌బాయ్ ఉన్నారు. డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ (34), మరో సహాయకుడు చంద్రన్ మృతి చెందినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.

 డైరెక్టర్ శంకర్‌కు గాయాలు.. కన్నీరు పెట్టుకున్న కమల్

డైరెక్టర్ శంకర్‌కు గాయాలు.. కన్నీరు పెట్టుకున్న కమల్

ఈ దుర్ఘటనలో డైరెక్టర్ శంకర్‌ కూడా స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. శంకర్ సహా గాయపడిన వారందరినీ వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న కమల్ హాసన్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తన సినిమా షూటింగ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం పట్ల కమల్ కన్నీరు పెట్టుకున్నారు.

 ఉలిక్కిపడ్డ పరిశ్రమ.. రజినీకాంత్ ఫోన్

ఉలిక్కిపడ్డ పరిశ్రమ.. రజినీకాంత్ ఫోన్

ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసి తమిళ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. పలువురు సినీప్రముఖులు ఘటనా స్థలానికి వచ్చి ప్రమాద వివరాలు తెలుసుకుంటున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఫోన్ చేసి ఘటనపై తెలుసుకున్నట్లు సమాచారం.

భారతీయుడు 2 మూవీ

భారతీయుడు 2 మూవీ

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 మూవీ రూపొందుతోంది. చిరంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో 85 ఏళ్ల ముసలమ్మ పాత్రలో ఆమె నటిస్తుండటం విశేషం. తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X