అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం?
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ప్రముఖ అన్నపూర్ణ స్టూడియో అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందినదనే విషయం తెలిసిందే.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. అన్నపూర్ణ స్టూడియో రెండు సెట్లకు మంటలు అందుకొన్నట్టు తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే ఓ సెట్ పూర్తిగా ధ్వంసమైనట్టు సమాచారం. మరో సెట్లో మంటలు ఎగిసిపడుతున్నట్టు తెలుస్తున్నది.

ప్రమాదం సంభవించిన వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది నీటితో మంటలను ఆర్పేందుకు స్టూడియో సిబ్బంది యత్నించారు. అగ్నిమాపక సిబ్బంది స్టూడియోకు చేరుకొని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై ఇంకా వివరాలు తెలియరాలేదు.
akkineni nagarjuna annapurna studio fire accident అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియో అగ్ని ప్రమాదం


Click it and Unblock the Notifications