For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇండియన్ సినీ హిస్టరీలో తొలిసారి.. మేజర్ కోసం టీమ్ రేర్ ఫీట్!

  |

  దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక రక్షణ శాఖ అధికారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ సినిమా విడుదలకు ముందే అనేక రికార్డులు బద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మునుపెన్నడూ లేని విధంగా తొమ్మిది నగరాలలో సినిమా విడుదలకు పదిరోజుల ముందు నుంచి ప్రీమియర్ షోలు ప్రసారం చేస్తుండగా ఇప్పుడు ఏకంగా ప్రీమియర్ షోల తర్వాత కూడా ప్రీ రిలీజ్ నిర్వహిస్తున్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా రికార్డులకెక్కింది. ఆ వివరాల్లోకి వెళితే.

  Recommended Video

  Major Movie Trailer Launch Event | Filmibeat Telugu
  సొంతం అంటూ

  సొంతం అంటూ


  తెలుగులో సొంతం అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత కర్మ హీరోగా మారాడు అడివి శేష్. ఆ తర్వాత పంజా, బలుపు, కిస్, రన్ రాజా రన్, బాహుబలి, దొంగాట, సైజ్ జీరో వంటి సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ కూడా పోషించిన ఆయన క్షణం సినిమాతో మంచి బ్రేక్ అందుకున్నాడు. తర్వాత ఊపిరిలో ఒక కీలక పాత్రలో నటించిన ఆయన గూడచారి, ఓ బేబీ, ఎవరు? వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

   ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా

  ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా


  అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం మేజర్. 26/11 ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. అడివి శేష్ కి ఈ మేజర్ అనేది మొట్ట మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్. అయితే తమిళ, కన్నడ భాషల్లో విడుదల కాకపోయినా తెలుగు, హిందీ, మలయాళ భాషలలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా విడుదలవుతోంది కాబట్టి ఒక రకంగా పాన్ ఇండియా మూవీగానే లెక్క వేసుకోవచ్చు.

  అబ్బూరి రవి డైలాగ్స్

  అబ్బూరి రవి డైలాగ్స్


  ఈ సినిమాని మహేష్ బాబుకు చెందిన ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఇండియా ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల పాత్రలో నటించగా సందీప్ ప్రేయసిగా సాయి మంజ్రేకర్ నటించింది.

   తెలుగు సినీ హిస్టరీలో మొట్ట మొదటి సారి

  తెలుగు సినీ హిస్టరీలో మొట్ట మొదటి సారి


  అలాగే కీలక పాత్రలో శోభిత ధూళిపాళ్ల నటించారు. ఇక జూన్ 3వ తేదీన భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమాను తొమ్మిది నగరాలలో 24వ తేదీ నుంచి ప్రీమియర్ షోలు వేస్తున్నట్లుగా సినిమా యూనిట్ ప్రకటించింది. ఒక సినిమా విడుదలకు పది రోజులు ముందే ఇలా ప్రీమియర్స్ వేయడం అనేది తెలుగు సినీ హిస్టరీలో మొట్ట మొదటి సారి అని చెప్పవచ్చు. అదే ఒక హిస్టరీ అనుకుంటే ఇప్పుడు మరో విషయంలో కూడా హిస్టరీ సృష్టించింది.

   ఇండియన్ సినిమా హిస్టరీలో

  ఇండియన్ సినిమా హిస్టరీలో


  నిజానికి బుక్ మై షో సంస్థతో కలిసి మే 24 నుంచి 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ స్ ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితేనేమి మళ్ళీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 29న వైజాగ్ లో చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమా రిలీజ్ అయ్యాక ప్రీ రిలీజ్ వేడుకలు జరగడం ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదే తొలిసారి.

  English summary
  For the first time in INDIAN CINEMA, a PRE-RELEASE EVENT after an exclusive PREMIERE SHOW for the audience is happening for major movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X