'మేజర్‌'అరుదైన రికార్డు.. మరో ఇండియన్ మూవీ సాధించని విధంగా పాక్ సహా 14 దేశాల్లో!

అడవి శేష్ హీరోగా రూపొందిన మేజర్ సినిమా విడుదలైన నాటి నుంచి దాదాపు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటూ ముందుకు వెళుతుంది. ఇప్పటికే ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇంకా ఈ సందర్భంగా ఈ సినిమాకు అరుదైన రికార్డు అందుకుంది. ఇప్పటివరకు ఏ భారత దేశ సినిమా కూడా ఈ రికార్డ్ అందుకోలేదని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

 ముంబై అటాక్స్ లో

ముంబై అటాక్స్ లో

క్షణం, గూడచారి వంటి సినిమాలతో హీరోగా మంచి క్రేజ్ సంపాదించిన అడవి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం మేజర్. గూడచారి దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించింది. 26 11 ముంబై అటాక్స్ లో అసువులు బాసిన కేరళ రాష్ట్రానికి చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు మేకర్స్.

మహేష్ బాబు సహనిర్మాతగా

మహేష్ బాబు సహనిర్మాతగా

సోనీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో మహేష్ బాబు కూడా సహనిర్మాతగా వ్యవహరించారు. కేవలం తెలుగులోనే కాక హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక కేవలం థియేటర్ హిట్ గానే కాకుండా ఈ సినిమా డిజిటల్ వేదికగా కూడా సూపర్ హిట్ గా నిలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నెట్ఫిక్స్ వేదికగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

 ఆశ్చర్యంగా

ఆశ్చర్యంగా

నెట్ ఫ్లిక్స్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తరించి ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు దాదాపు అన్ని దేశాల్లోనూ అద్భుతమైన స్పందన లభిస్తున్నట్లు సమాచారం. మన పొరుగు దేశమైన పాకిస్థాన్ సహా 14 దేశాల్లో ఈ సినిమా టాప్ టెన్ సినిమాల్లో స్థానం సంపాదించింది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చి మారణకాండకు పాల్పడిన ఉగ్రవాదుల గురించి ఈ సినిమాలో ప్రస్తావించారు. అలాంటి సినిమాని పాకిస్తాన్లో కూడా చూస్తున్నారు అంటే ఆశ్చర్యంగా ఉందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు.

ట్రెండింగ్స్‌ టాప్‌-10లో

ట్రెండింగ్స్‌ టాప్‌-10లో

బహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌, కువైట్‌, మలేషియా, మాల్దీవులు, ఒమన్‌, పాకిస్థాన్‌, ఖతార్‌, సింగపూర్‌, శ్రీలంక, యూఏఈ సహా 14 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్స్‌ టాప్‌-10లో 'మేజర్‌' నిలవగా ఇండియా, మారిషస్‌, నైజీరియాలో టాప్‌-1లో ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాలో అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో నటించగా ఆయన ప్రేయసి పాత్రలో సాయి మంజ్రేకర్ నటించారు. ఇక ఒక కీలకపాత్రలో శోభిత ధూళిపాళ్ల నటించగా అడవి శేషు తల్లిదండ్రుల పాత్రలో ప్రకాష్ రాజ్, రేవతి నటించి అదరగొట్టారు.

సోషల్ మీడియా వేదికగా

సోషల్ మీడియా వేదికగా

'మేజర్‌' ట్రెండింగ్‌ వార్తల పై హీరో అడవి శేష్‌ సంతోషం వ్యక్తం చేశారు. 'నాకు చాలా ఆనందంగా ఉందన్న ఆయన సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటానని, నిజంగా మేము గర్వపడే సందర్భమిది, ఈ చిత్రం ఎప్పటికీ ప్రత్యేకమే' అని అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రస్తుతం మేజర్ అన్ని దేశాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X