twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సురేష్ బాబుకు జారి చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో స్టే

    By Srikanya
    |

    హైదరాబాద్: ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించకుండా డి. సురేష్ బాబును నియంత్రిస్తూ సిటీ సివిల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో సురేష్ బాబుకు హైకోర్టు ఊరటనిచ్చింది.

    పిటీషన్ వివరాల్లోకి వెళితే.. సురేష్ బాబు ఫిలిం చాంబర్‌కు బకాయిలున్నారని, అలాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని, అయినా కూడా పోటీ చేసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పంపిణీదారుడు మురళీమోహన్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    Major relief to Producer D. Suresh Babu

    దీనిని విచారించిన సివిల్ కోర్టు, చాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించకుండా సురేష్‌బాబును నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అటు చాంబర్, ఇటు సురేశ్‌ బాబు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

    సురేష్‌బాబు ఎలాంటి బకాయిలు లేరని, నిబంధనల మేరకు ఎన్నికైన వ్యక్తిని బాధ్యతలు నిర్వర్తించకుండా అడ్డుకోవడం సరికాదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య సివిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించారు.

    English summary
    In a major relief to top producer Daggubati Suresh Babu, the High Court stayed the city civil court order suspending him from serving as the president of Andhra Pradesh Film Chamber of Commerce. Orders to this effect were issued on Mondayby Justice G Chandraiah.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X