Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పూరి ‘రొమాంటిక్’లో దండుపాళ్యం స్టార్
పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న 'రొమాంటిక్' మూవీ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. అనిల్ పాడూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తాజాగా మరో ప్రముఖ యాక్టర్ జాన్ అయ్యారు. దండుపాళ్యం సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన మకరంద్ దేశ్పాడే ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.
హీరోయిన్గా ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మను ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హాట్ లేడీ మందిరా బేడీ సైతం ఇటీవలే గోవా షూటింగులో జాయిన్ అయ్యారు. వీరితో పాటు రాజీవ్ కనకాల, దివ్య దర్శిని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈచిత్రాన్ని పూరి జగన్నాధ్ నిర్మించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా, పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సారి ప్రమోగాల జోలికి వెల్లకుండా కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యేలా సినిమాను తెరకెక్కిస్తున్నారు.
పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బేనర్లో లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిల్ పాడూరికి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. పూరి అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటున్నారు.