పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానంటున్న శేఖర్ కమ్ముల
హైదరాబాద్ : దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా మేకింగ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్నాడు. ఇటీవల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన శేఖర్ కమ్ముల అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని స్పష్టం చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...'నా ఫేవరెట్ హీరో చిరంజీవి. పవన్ కళ్యాణ్ నాకు అందనంత ఎత్తులో ఉన్నారు. పవన్ అంటే నాకు ఎంతో ఇష్టం అతనితో సినిమా చేయాలని ఉంది. నాకు అవకాశం వస్తే ఎప్పటికైనా తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా' అని వెల్లడించారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇటీవల విడుదలైన ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా కేవలం క్లాస్ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునే విధంగా ఉంది. అర్భన్ ఆడియన్స్ మాత్రమే ఈచిత్రాన్ని ఇష్ట పడతున్నారు. మాస్ మసాలా ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు ఈచిత్రాన్ని అంతగా ఇష్ట పడటం లేదు. శేఖర్ కమ్ముల త్వరలో నాగార్జున తనయుడు అఖిల్‌ను పరిచయం చేస్తూ సినిమా చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమన్నా హీరోయిన్. డీవీవీ దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరులో ఆడియో అక్టోబర్ నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











