twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    67th National Film Awards: జెర్సీ, మహర్షి సినిమాలకు నేషనల్​ అవార్డ్స్.. అందుకున్న దర్శకనిర్మాతలు

    |

    ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సం కార్యక్రమం సోమవారం నాడు గ్రాండ్ గా జరిగింది. భారతీయ సినిమా వాళ్లంతా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులకు, ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలకు ఇండియన్ వైస్‌ ప్రెసిడెంట్‌ వెంకయ్యనాయుడు అవార్డులు అందజేశారు. తెలుగులో 'జెర్సీ', 'మహర్షి' సినిమాలకు నాలుగు విభాగాల్లో ఐదు జాతీయ అవార్డులు దక్కాయి. జెర్సీకి రెండు, మహర్షికి మూడు అవార్డులు ద‌క్కాయి. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ నిలవగా, జెర్సీ చిత్రానికి బెస్ట్ ఎడిటర్‌గా నవీన్‌ నూలి అవార్డు సాధించారు.

    అలాగే జాతీయ అవార్డుల్లో ఎవరూ ఊహించని విధంగా మూడు నేషనల్ అవార్డులను దక్కించుకుంది మహర్షి సినిమా. తెలుగు భాషలో ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న మహర్షి సినిమాను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్‌గా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఇక ఈ చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం జాతీయ అవార్డు పొందారు.

    Makers of Maharshi and jersey recived awards in 67th National Film Awards ceremony

    ఇక ఇతర బాషల విషయానికి వస్తే జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్ అవార్డు అందుకున్నారు. మణికర్ణిక చిత్రానికి కంగనా జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికయ్యారు. ఇక దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చిచోరే సినిమా ఉత్తమ హిందీ చిత్రంగా అవార్డును అందుకోగా అసురన్‌ చిత్రంలో అద్భుత‌మైన నటనకు ధనుష్‌ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం ద‌క్కించుకున్నాడు. సూపర్ డీలక్స్‌ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడు అవార్డు విజయ్‌సేతుపతికి దక్కింది. మలయాళం జల్లికట్టు సినిమాకు గాను బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు గిరీష్ గంగాధరన్‌ అందుకున్నారు.

    ఇక బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డును మలయాళం మూవీ మరక్కర్ ద‌క్కించుకుంది. మరోపక్క సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు విశిష్ట పురస్కారం ల‌భించింది. సినీ ఇండ‌స్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'దాదాసాహెబ్‌ ఫాల్కే' అవార్డు ఆయనకు వ‌రించింది. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేస్తున్న సేవలును గుర్తించి కేంద్రప్రభుత్వం ఆయ‌న‌ను ఈ పురస్కారంతో గౌరవించింది. ఈరోజే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ర‌జినికాంత్‌కు అవార్డును అందజేశారు.

    ఇక మొత్తం మీద 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు ఎవరనేది చూస్తే ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ, ఉత్తమ పాపులర్‌ చిత్రంగా మహర్షి, ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌ (మణికర్ణిక), ఉత్తమ నటుడుగా మనోజ్‌ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్‌ (అసురన్‌) ఉత్తమ హిందీ చిత్రంగా చిచ్చోరే, ఉత్తమ తమిళ చిత్రంగా అసురన్‌, ఉత్తమ మలయాళ చిత్రంగా మరక్కర్, ఉత్తమ దర్శకుడుగా సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ (బహత్తర్‌ హూరైన్‌), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌ కు గాను మరక్కర్‌ (మలయాళం) సినిమాలు నిలిచాయి.

    ఉత్తమ సహాయ నటుడుగా విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌), ఉత్తమ సహాయ నటిగా పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌), ఉత్తమ కొరియోగ్రాఫర్‌ గా రాజు సుందరం (మహర్షి), ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రహీ మూవీగా అవనే శ్రీమన్నారాయణ(కన్నడ), ఉత్తమ సంగీత దర్శకుడుగా (పాటలు) డి.ఇమ్మాన్‌ (విశ్వాసం), ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడుగా ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్ట పుత్రో), ఉత్తమ గాయకుడుగా బ్రి. ప్రాక్‌ (కేసరి చిత్రంలోని 'తేరీ మిట్టీ...'), ఉత్తమ గాయనిగా శావని రవీంద్ర (బర్దో-మరాఠీ) ఉత్తమ మేకప్‌ మెన్ గా రంజిత్‌ (హెలెన్‌), ఉత్తమ ఎడిటింగ్‌- నవీన్‌ నూలి (జెర్సీ)లు అవార్డులు అందుకున్నారు.

    English summary
    Makers of Maharshi and jersey recived awards in 67th National Film Awards ceremony.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X