SSMB 28: మహేష్ బాబు కెరీర్ లో మరొక బిగ్గెస్ట్ సెట్.. మళ్ళీ అదే తరహాలో..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల లిస్టులో మహేష్ బాబు కూడా చేరిపోయాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకేసారి మూడు సినిమాలను లైన్ లో పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న మహేష్ ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 28వ ప్రాజెక్టును స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.

ఎలాగైనా వచ్చే ఏడాది సమ్మర్ కు ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారు. అయితే సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ యాక్షన్ ప్లస్ ఫ్యామికి డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తనదైన శైలిలో పవర్ఫుల్ డైలాగ్స్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ను జత చేయబోతున్నట్లు టాక్ వస్తోంది. ఇక సినిమాలో ఎప్పటిలానే త్రివిక్రమ్ ఒక పెద్ద ఇంట్లో ఫ్యామిలీ సీన్స్ ను షూట్ చేస్తాడట.

Makers of Mahesh Babus SSMB28 to erect a lavish house set

దాదాపు త్రివిక్రమ్ అన్ని సినిమాల్లో ఇంటికి సంబంధించిన సెట్స్ కథలో కలిసిపోయేలా ఉంటాయి. అతడు, జల్సా నుంచి కూడా త్రివిక్రమ్ ఒకే తరహాలో మ్యాజిక్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక మహేష్ కెరీర్ లో గతంలో ఒక్కడు, అర్జున్ వంటి సినిమాల్లో భారీ సెట్స్ నిర్మించగా ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. ఆర్ట్ డైరెక్టర్ AS ప్రకాష్ నేతృత్వంలో సెట్ కి సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ సినిమాకు సెట్స్ ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X