For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీకాంత్ రోబో ‘2.0’ 3డి మేకింగ్... ఎంత అద్భుతంగా ఉందో! (వీడియో)

  By Bojja Kumar
  |

  రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రోబో '2.0' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 2018లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 3డి ఎఫెక్టులతో ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించనుంది.

  తాజాగా ఈ సినిమాకు సంబంధించి త్రీడీ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమా కోసం ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్, శంకర్, టెక్నీషియన్లు ఎంత కష్టపడ్డారు అనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా బాహుబలిని మించిన సంచలనం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

  స్క్రిప్టు డిమాండ్ చేసింది కాబట్టే 3డి

  స్క్రిప్టు డిమాండ్ చేసింది కాబట్టే 3డి

  దర్శకుడు శంకర్ మాట్లాడుతూ... "ఏదో పేరు కోసం 3డిలో ఈ సినిమా చేయలేదు. ఈ సినిమా స్క్రిప్ట్‌కు 3డి టెక్నాలజీ అవసరం అయింది. హాలీవుడ్ ఫిల్మ్స్ లో చాలా వరకు 2డి షూట్ చేసి ఆ తర్వాత వాటిని పోస్టు ప్రొడక్షన్ లో 3డిలోకి మార్చుతారు. అసలు 3డిలో మనం క్రియేట్ చేసే డెప్త్ అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ సినిమాని నేరుగా లేటెస్ట్ 3డి కెమెరాతోనే షూట్ చేశాం. నేను మానిటర్లో షాట్ చూస్తున్నపుడు, నేను అక్కడే ఉన్నట్లుగా, అక్కడే కథ జరుగుతున్నట్లుగా ఫీల్ అయ్యాను. ఇందులో చాలా విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్, యాక్షన్ సీన్లు ఉన్నాయి. మీరు ఆ విజువల్ సీన్స్ ను, యాక్షన్ సీన్స్ ను 3డిలో బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఆడియన్స్ కూడా వాళ్ల స్టార్స్ ని వాళ్లకి బాగా దగ్గరగా చూడ్డానినికి ఎగ్జైట్ అవుతారు. ఇది సినిమాను మించిన అనుభవం. ఆ అనుభవాన్ని 3డి టెక్నాలజీ ద్వారానే పూర్తిగా టాప్ చేయాలి. ఈ సినిమా చాలా మంది ప్రొడ్యూసర్స్ ను 3డిలో సినిమా తీయాలనేలా ప్రోత్సహిస్తుంది. చాలా థియేటర్స్ 3డి థియేటర్స్‌గా మారతాయనుకుంటున్నాను." అన్నారు.

  మ్యాజికల్ గా ఉంటుంది

  మ్యాజికల్ గా ఉంటుంది

  సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా మాట్లాడుతూ.... 3డి మిమ్మల్ని యాక్షన్ మధ్యలోకి తీసుకెలుతుంది. ఎందుకంటే ఇండియాలో మనం పెద్దగా దాన్ని చూడలేదు. ఇది దాదాపు మ్యాజికల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కటీ బాగా పెద్దగా కనిపిస్తుంది. 2డి కోసం షూట్ చేస్తున్నపుడు ఫ్లాట్ ఇమేజ్ షూట్ చేస్తారు. కానీ 3డి కోసం షూట్ చేసినపుడు స్పేస్ ని షూట్ చేస్తారు.... అని తెలిపారు.

  ఆడియన్స్ రియాక్షన్ చూడాలని వెయిట్ చేస్తున్నాను

  ఆడియన్స్ రియాక్షన్ చూడాలని వెయిట్ చేస్తున్నాను

  రజనీకాంత్ మాట్లాడుతూ... శంకర్ 3డిని దృష్టిలో ఉంచుకుని ఈ స్క్రిప్టు రాశారు. అది చాలా ముఖ్యమైనది. ఫస్ట్ 3డి షాట్ నేను చిన్న స్క్రీన్ లో చూశాను. నేను మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు. నేను శంకర్ ను మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే అది మెస్మరైజ్ చేస్తుంది. నేను ఆడియన్స్ రియాక్షన్ చూడాలని వెయిట్ చేస్తున్నాను. నేను మీకు కచ్చితంగా చెప్పగలను, ఇది ఒక పెద్ద హాలీవుడ్ 3డి మూవీ స్థాయిలో ఉంటుంది అన్నారు.

  అరుదైన అనుభవం

  అరుదైన అనుభవం

  అక్షయ్ కుమార్ మాట్లాడుతూ... 3డిలో పని చేయడం నేను అనుకున్న దానికంటే చాలా కష్టం. ప్రతి షాట్ లో సెటప్ నుండి అన్నీ పర్ ఫెక్టుగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి షాట్ తర్వాత నేను వెనక్కి వెళ్లి, డైరెక్టర్ తో పాటు కూర్చుని హైటెక్ 3డి గ్లాసులతో షాట్ చెక్ చేశాను. ఇండియాలో 3డికి అయితే ఇది అరుదైన అనుభవం. ఆ ఎగ్జైట్మెంట్ పది రెట్లు ఉంటుంది. అన్నారు.

  రే హన్నిసియన్, లీడ్ స్టీరియోగ్రాఫర్

  రే హన్నిసియన్ మాట్లాడుతూ... తొలి సన్నివేశాలలో నిజంగా ఉన్న భావన కలిగించేలా చేసి ప్రేక్షకులను సినిమాకి ఆహ్వానించడానికి ఇది మా ప్రయత్నం. మీరు అడవిలో ఒక పిక్చర్ తీసకుంటే కనుక ప్రతి ఆకు, ప్రతి చెట్టు, ప్రతి గడ్డి పరకకు విడివిడిగా డెప్త్ ఉంటుంది.. మూవీ చూస్తున్నపుడు డ్రామా డైనమిక్ గా అవుతుంది. ఆడియన్స్ కి స్క్రీన్ మధ్య ఎక్కువ యాక్షన్ దీసుకుకావడానికి అపుడు మేం 3డిని పెంచాం. దాంతో అది థియేటర్లలో చక్కగా పని చేస్తుంది అన్నారు.

  జనవరి 25, 2018లొ విడుదల

  జనవరి 25, 2018లొ విడుదల

  ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం మాట్లాడుతూ - ''రజనీకాంత్‌గారితో శంకర్‌గారు చేస్తున్న మరో అద్భుతమైన చిత్రమిది. ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన 3డి మేకింగ్‌ వీడియోను ఈరోజు విడుదల చేశాం. ఈనెల 27న దుబాయ్‌లో ఈ చిత్రం ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేశాం'' అన్నారు.

  నటీనటులు

  నటీనటులు

  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

  తెరవెనక

  తెరవెనక

  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఎడిటింగ్‌: ఆంటోని, సమర్పణ: సుభాష్‌ కరణ్‌, లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌: రాజు మహాలింగం, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌.

  English summary
  Making of 2.0 - 3D Featurette video released. 2.0 is a Science Fiction film featuring "Superstar Rajinikanth" & Akshay Kumar, being directed by Shankar and music by A. R. Rahman.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X