»   » అనుష్క బర్త్‌డ్ గిప్ట్: 'బాహుబలి' బిహైండ్ ద సీన్స్-2 ( వీడియో లింక్)

అనుష్క బర్త్‌డ్ గిప్ట్: 'బాహుబలి' బిహైండ్ ద సీన్స్-2 ( వీడియో లింక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న 'బాహుబలి' చిత్రం బిహైండ్ ద సీన్స్ వీడియో ని విడుదల చేసారు. ప్రభాస్, అనుష్క జంటగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ రాజమౌళి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'బాహుబలి' చిత్రం షెడ్యూల్ పూర్తయింది.

భారతీయ సినీ చరిత్రలో భారీ బడ్జెట్‌లో నిర్మించిన చిత్రాల జాబితాలో చేరబోతున్న ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఐదు భారీ సెట్స్‌లో ఇప్పటివరకూ షూటింగ్ జరిగింది. గురువారం అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన 'బిహైండ్ ద సీన్స్' వీడియోను విడుదల చేసారు.

ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ 'రాజమౌళిగారితో మళ్లీ పని చెయ్యడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. తను అనుకున్న సీన్స్ బాగా రావడం కోసం ఆయన చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ సినిమా కోసం ఇప్పటి వరకూ 60 రోజులకు పైగా పనిచేశామంటే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే షూటింగ్ చేస్తుంటే టైమే తెలియడం లేదు' అన్నారు.

లింక్ ఇదే...


ఈ చిత్రానికి కథ: వి.విజయేంద్రప్రసాద్, సంగీతం: కీరవాణి, ఫొటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్, మాటలు: అజయ్, విజయ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, స్టైలింగ్: రమా రాజమౌళి, ప్రశాంతి తిపిర్నేని, నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.

English summary
Rajamouli released Baahubali behind scenes video part 2 for Anushka's Birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu