భల్లలదేవ పాత్రలో రానా (బాహుబలి కొత్త టీజర్ రిలీజ్)
హైదరాబాద్: 'బాహుబలి' చిత్ర దర్శకుడు రాజమౌళి సినిమా పబ్లిసిటీ విషయంలో ప్లానింగ్‌గా ముందుకు సాగుతున్నారు. తొలుత ప్రభాస్ బర్త్ డే సందర్భంగా బాహుబలి తొలి మేకింగ్ వీడియోను విడుదల చేసి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని మరొక మేకింగ్ వీడియో విడుదల చేసారు.
బాహుబలి మూడో టీజర్ నేడు (డిసెంబర్ 14న) విడుదల చేసారు. ఈ రోజు విడుదల చేయడానికి కారణం రానా పుట్టినరోజు కావడమే. 10:10 AM on 14/12/1984 తేదీన రాణా జన్మించారు. అందుకే టీజర్ కూడా కరెక్టుగా 10:10 AMకు విడుదల చేసారు. అందుకు సంబంధించిన టీజర్ ఇక్కడ చూడొచ్చు.

ఈ చిత్రంలో రాణా భల్లలదేవ పాత్రలో కనిపించనున్నాడు. ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. కొన్ని రోజులుగా కేరళలో షూటింగ్ జరుగుతోంది. ఈచిత్రానికి సంబంధించిన భారీ యుద్ద సన్నివేశాల డిసెంబర్ 15న నుంచి చిత్రీకరించనున్నారు.
ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/RRzUJSLev1E?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications











