twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' మేకింగ్ : ఈ సారి రమ్యకృష్ణ పై (కొత్త వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ :తన సినిమా కథ.. ఆయా పాత్రల తీరుతెన్నులను క్రమంగా ప్రేక్షకుల మనస్సులలో ఇంజెక్ట్ చేయడంలో సిద్ధహస్తుడు రాజమౌళి. బాహుబలి విషయంలోనూ ఇదే పద్దతిలో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ట్రైలర్ ని, పోస్టర్స్ ని విడుదల చేసారు. తాజాగా రమ్యకృష్ణకు సంబంధించిన మేకింగ్ వీడియో ను విడుదల చేశాడు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడండి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    రమ్యకృష్ణ ప్రతిభ ఏమిటో తెలుగు ప్రేక్షకులందరికి తెలుసు. తాను చేసే ప్రతి పాత్రలో పరిపూర్ణత కోసం తపిస్తుందామె. బాహుబలి చిత్రంలో ఆమె శివగామిగా కీలక పాత్రలో నటిస్తున్నారు. రమ్యకృష్ణ మేకింగ్ చూసిన వాళ్లు ఆమె ప్రతిభ చూసి మంత్ర ముద్గులు అవుతున్నరు.

    గతంలో ఆమె గురించి ....ఇంతటి తీవ్రమైన భావోద్వేగాలున్న పాత్రను, దానికి పూర్తిగా న్యాయం చేయగలిగే ప్రతిభాపాటవాలున్న నటిని ఇప్పటివరకు చూడలేదు. న్యాయానికి నిలువెత్తు రూపం ఈ శివగామి అంటూ రమ్యకృష్ణ పాత్ర గురించి రాజమౌళి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

    Making of Baahubali - Ramya Krishna as SIVAGAMI

    గతంలో విడుదల చేసిన పోస్టర్స్ తో ఆయా క్యారెక్టర్స్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిన రాజమౌళి.. తాజా మేకింగ్ విషయంలో మాత్రం.. పాత్రను పక్కనపెట్టి ఈ చిత్ర నిర్మాణంలో రమ్యకృష్ణ ఎమోషన్స్ ని పండించే తీరుని చూపించారు. గత రెండున్నర ఏళ్లుగా బాహుబలి యూనిట్‌ కు రమ్యకృష్ణ వెన్నుదన్నుగా నిలచారని.. కృతజ్ఞతలు తెలియజేశాడు.

    ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ తో పోల్చి చూస్తే.. రమ్యకృష్ణ లుక్ మాత్రం అంత కొత్తగా ఏం అనిపించడం లేదు. కాస్ట్యూమ్స్ విషయంలో... పురాతన రాచరికం కంటే ఆధునిక జమిందారితనమే ఎక్కువగా కన్పిస్తోందని విమర్శలు వచ్చాయి. ఇప్పటికే రమ్యకృష్ణ ఈ తరహా హావభావాలతో 'నీలాంబరి' వంటి పాత్రలో మెప్పించడం వల్ల కాబోలు... 'శివగామి'లో కొత్తదనం కొరవడిందనిపిస్తోందని అన్నారు. అయితే... అలా నిరాశ పడిన రాజమౌళి అభిమానులను శివగామిగా రమ్యకృష్ణ మేకింగ్ వీడియో ఓదార్చినట్లే.

    ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

    ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.

    భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

    English summary
    Baahubali is an upcoming Indian movie that is simultaneously being shot in Telugu and Tamil. The film will also be dubbed in Hindi, Malayalam
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X