సెక్సీ వీడియోలతో వేడెక్కిస్తున్నారు...!(వీడియో)
ముంబై: బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'హేట్ స్టోరీ 2' చిత్రానికి వినూత్న రీతిలో ప్రచారం కల్పిస్తున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలై హాట్ టాపిక్ అయింది. ట్రైలర్లో హీరో హీరోయిన్ల మధ్య హాట్ హాట్ ముద్దు సీన్లు, పడక గది సీన్లు ఉండటంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.
మరో వైపు హీరోయిన్ సుర్వీన్ చావ్లా టాప్‌లెస్ వాల్ పోస్టర్లు కూడా సినిమాకు హైప్ తేవడానికి సహకరించాయి. తాజాగా సుర్వీన్ చావ్లా టాప్ లెస్ వాల్ పోస్టర్లకు సంబంధించిన ఫోటో షూట్ మేకింగ్ వీడియో విడుదల చేసారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమాకు హైప్ తేవడానికి ఒక ప్లాన్ ప్రకారం ఈ హాట్ వీడియోలు విడుదల చేస్తున్నారు.

గతంలో 'హేట్ స్టోరీ' చిత్రాన్ని నిర్మించిన విక్రమ్ భట్ 'హేట్ స్టోరీ 2' ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్రమ్ భట్ అసిస్టెంట్ విశాల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. టీవీ యాక్టర్ జయ్ భానుశాలి, పంజాబీ నటి సర్వీన్ చావ్లా ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. తెలుగులో గతంలో వచ్చిన 'రాజుమహారాజు' అనే సినిమాలో సుర్వీన్ చావ్లా నటించింది.
<center><iframe width="100%" height="510" src="//www.youtube.com/embed/omAlW2bNSVE" frameborder="0" allowfullscreen></iframe></center>
తన జీవితాన్ని, ప్రేమను నాశం చేసిన ఒక వ్యక్తిపై ఓ మహిళ ఎలా రివేంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈచిత్రం సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య సాగే హాట్ హాట్ బెడ్రూం సీన్లు, ముద్దు సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఈచిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. జులై 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











