ఇదిగో ఇదో రకం పబ్లిసీటీ:కుర్ర హీరో కొత్త ఐడియా (వీడియో)
హైదరాబాద్: రోజు రోజుకీ పబ్లిసిటీ కొత్త పుంతలు తొొక్కుతోంది. ఇంతకు ముందు సినిమా రిలీజయ్యాక ...డీవిడిలో మేకింగ్ వీడియో లు వచ్చి అలరించేవి. ఇప్పుడు రిలీజ్ కు ముందు ప్రమోషన్ లో భాగంగా సినిమా మేకింగ్ వీడియోలు మన ముంగిట వాలుతున్నాయి. అలాంటి పబ్లిసిటీలోనే నిఖిల్ తాజా చిత్రం కార్తికేయ టీమ్ మరో స్టెప్ ముందుకు వేసారు. పోస్టర్స్ మేకింగ్ వీడియోని విడుదల చేసారు. తమ చిత్రం పోస్టర్స్ ని ఎలా డిజైన్ చేసారో...తమకు ఆ డిజైనర్స్ తో ఎలాంటి అనుబంధం ఉందో వీడియో తీసి వదిలారు...అంత కష్టపడి లేదా ఇష్టపడి వదిలిన వీడియోని మీరూ ఓ లుక్కేయండి...
నిఖిల్, స్వాతి కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘కార్తికేయ' పరిస్ధితి అది కాదంటున్నారు. గ్రాఫిక్స్ తోనే లేటు అని చెప్తున్నారు. అయితే రీషూట్ లు కూడా చేసారని సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా అక్టోబర్ 24 విడుదల చేయాలని నిర్ణయించి, విడుదల తేదీ లాక్ చేసారు. సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం రెండు గంటల ఆరు నిముషాల లెంగ్త్ ఉంది. శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ధ్రిల్లర్‌తో కూడిన వినొదాత్మక చిత్రంగా దీనికి రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు.

చిత్ర హీరో,హీరోయిన్స్ వైద్య విద్యార్ధులుగా కనిపిస్తారీ చిత్రంలో.. ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదు.. ఒక వేళ సమాధానం దొరకలేదు అంటే ఆ లోపం ప్రశ్నది కాదు, ప్రయత్నానిదే అని నమ్మే మనస్తత్వం చిత్ర హీరో 'నిఖిల్'ది. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన సంఘటనలు, సన్నివేశాల సమాహారమే ఈ 'కార్తికేయ' చిత్రం.
ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళ భరణి, నాజర్, రావు రమేష్, ప్రవీణ్, తులసి, కిషోర్, స్వామిరారా సత్య, జోగినాయుడు, శివన్నారాయణ, మీనాకుమారి,చంద్రశేఖర్ గిరి, కృష్ణంరాజు, వేణుగోపాలరావు, ఐ కె. త్రినాధ్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమేరా: కార్తీక్ ఘట్టమనేని. ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: శేఖర్ చంద్ర, పాటలు: కృష్ణ చైతన్య, కొరియో గ్రఫీ: రఘు, ఆర్ట్: సాహి సురేష్, కో డైరెక్టర్:అను కె రెడ్డి, ఎగ్జిక్యుటివ్ నిర్మాత: గునకల మల్లికార్జున, నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం; సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ, కధ - మాటలు -స్రీన్ ప్లే- దర్శకత్వం:చందు మొండేటి.


Click it and Unblock the Notifications











