‘మగధీర’ మెమోరీస్: రెండు సెకెన్ల సీన్ కోసం ఎంత కష్టపడ్డారో చూడండి
దర్శకధీరుడు రాజమౌళి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'మగధీర'. పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. రామ్ చరణ్ రెండవ సినిమా వచ్చిన 'మగధీర'ను గీతా ఆర్ట్స్ నిర్మించింది.
ఇందులో చెర్రీ సరసన కాజల్ అగర్వాల్ నటించగా, శ్రీహరి అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించారు. కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ సినిమా నేటి (జూలై 31)తో పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గత మదురానుభూతులను గుర్తు చేసుకుంటోంది. అదే సమయంలో మెగా ఫ్యాన్స్ కూడా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో 'మగధీర' ట్రెండ్ అవుతోంది.

ఈ శుభ పరిణామాన్ని గుర్తు చేసుకుంటూ చిత్ర హీరో రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. 'మగధీర' సినిమా పోస్టర్‌లను షేర్ చేయడంతో పాటు 'ఈ చిత్రం విడుదలై పదేళ్లు అయిందంటే నమ్మలేకుండా ఉంది. రీసెంట్‌గా ఈ చిత్రం విడుదలైనట్టు అనిపిస్తుంది. మగధీర చిత్ర టీం, కీరవాణి, కాజల్ అగర్వాల్, గీతా ఆర్ట్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. రాజమౌళి నుండి చాలా నేర్చుకున్నాను. ఇప్పటికీ ఆయన నుండి ఎంతో నేర్చుకుంటున్నాను' అని చెప్పుకొచ్చాడు.
అలాగే నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్ కూడా దీనిని గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేసింది. అలాగే, యూట్యూబ్‌లో ఓ పాట మేకింగ్ వీడియోను కూడా విడుదల చేసింది. 'మగధీర'లో స్లో మెలోడీగా వచ్చిన 'పంచదారా బొమ్మా బొమ్మా' అనే పాట వీడియోనే తాజాగా విడుదల చేశారు. అలాగే, సినిమా గురించి హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











