బాహుబలి: కట్టప్పగా సత్యరాజ్ (మేకింగ్ వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: బాహుబలి ఆడియో విడుదలకు ముందు సినిమాలోని వివిధ ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేస్తూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం ఆడియో వేడుక తిరుపతిలో గ్రాండ్‌గా జరిగింది. ఆడియో విడుదల తర్వాత సినిమా ప్రమోషన్లు సరికొత్తగా నిర్వహిస్తున్నారు.

సినిమాలోని వివిధ ప్రధాన పాత్రలకు సంబంధించిన మేకింగ్ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పలు పాత్రలకు సంబంధించిన మేకింగ్ వీడియోలు విడుదల చేయగా తాజాగా సత్యరాజ్ పోషిస్తున్న ‘కట్టప్ప' పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియో కూడా విడుదల చేసారు. ఈ చిత్రంలో కట్టప్ప సైన్యాధికారి పాత్ర పోషిస్తున్నారు.

జులై 10న బాహుబలి సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే సినిమా ప్రచార కార్యక్రమాలు వేగం పెంచారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కోసం దరఖాస్తు చేసుంది. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కానున్నాయి.

ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ లోగా చిత్రం యూనిట్ సైతం ప్రమోషనల్ ఏక్టివిటీస్ పెంచేసింది. భారతీయ చిత్ర పరిశ్రమలో రూ. 250 కోట్ల అత్యంత భారీ వ్యయం రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Making of Sathyaraj as KATTAPPA

ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. కీరవాణి సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మళయాలం, హిందీతో పాటు ఇంగ్లీష్, చైనా, జపనీస్, ఇతర విదేశీ బాషల్లోనూ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X