twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సరైన ప్లానింగ్ లేకపోబట్టే ఆరంజ్ ఇన్నిరోజులు చిత్రీకరించారు: చిరంజీవి

    By Nageswara Rao
    |

    మోగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించినటువంటి ఆరంజ్ సినిమా విడుదల ఇంక ఒక్కరోజు మాత్రమే ఉండడంతో యావత్ మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ఈసినిమాపై చాలా మంది దురాభిమానులు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో కోంచెం కంగారుగా ఉన్నారు మెగాకౌంపౌండ్ అభిమానులు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా రామ్ చరణ్ తేజ్ కెరియర్ పట్లు కోంచెం ఆందోళన చెందుతున్నారని ఫిలిం వర్గాల సమాచారం. దీనికి తోడు ప్రస్తుతం ఆరంజ్ సినిమాకి సంబంధించి బడ్జెట్ ఎక్కువ అవ్వడం సినిమాపై సరిగా అంచనా వేయకపోవడం లాంటివి కూడా చిరంజీవి దృష్టిలో పెట్టుకున్నట్లు సమాచారం.

    ఇకపోతే రామ్ చరణ్ తేజ్ 2007లో హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పటికీ ఇప్పిటివరకూ మూడు సినిమాలు మాత్రమే చెయ్యడం కూడా చిరంజీవికి నచ్చడం లేదు. అంతేకాకుండా ఆరంజ్ మరియు మెరుపు రెండు ఏకకాలంలో షూటింగ్ చేద్దామని రామ్ చరణ్ తేజ్ అనుకున్నప్పటికి దర్శకుల వల్ల అది వీలు పడలేదని రామ్ చరణ్ తేజ్ బాధపడడం జరిగింది. ఇలా పెద్దహీరోలు కూడా రెండు సంవత్సరాలుకి ఒక్కోక్క సినిమా అంటూ పోతే టాలీవుడ్ ఇండస్ట్రీ కికోంచెం ఇబ్బంది ఎదురవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    రామ్ చరణ్ తేజ్ నటించినటువంటి ఆరంజ్ సినిమా విషయానికి వచ్చేసరికే ఈసినిమా సింహా భాగం మొత్తం ఆస్ట్రేలియాలో షూటింగ్ చేయడం జరిగిందని సినిమా నిర్మాత నాగబాబు తెలిపారు. ఈసినిమాలో రామ్ చరణ్ తేజ్ మొట్టమొదటసారి లవర్ బాయ్ లాకనిపించనున్నారు. భారతీయులు ఆస్ట్రేలియాలో ఎదుర్కుంటున్నఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయనేది ఈసినిమా ముఖ్య ఉద్దేశ్యం గా చూపించనున్నారని సమాచారం. అలాంటి సమయంలో చదువు నిమిత్తం అక్కడకు వెళ్శినటువంటి రామ్ చరణ్ తేజ్ వాటికి ఏవిధంగా స్పందిస్తారనేది భాస్కర్ మలచిన తీరు అధ్బుతం అన్నారు నాగబాబు. అంతేకాకుండా సిడ్నీ నగరంలో రామ్ చరణ్ తేజ్ మరియు జెనిలియా మధ్య రోమాన్స్ కూడా చాలా అధ్బుతంగా తెరకెక్కించాడని భాస్కర్ కుకితాబు ఇచ్చారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X