Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాహుబలి-2 కంటే ముందే.... ‘హైపర్’ రికార్డు కొట్టేసింది (వర్చువల్ రియాల్టీ వీడియో)
హైదరాబాద్: టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సినిమా రంగంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, ఆపై కలర్ సినిమాలు, డిజిటల్ ప్రింట్, 2 డి, 3డి ఇలా చాలా చూసాం మనం ఇప్పటి వరకు.
ఈ మధ్య కాలంలో వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ గురించి కూడా వార్తలు వింటున్నాం. భవిష్యత్తులో మనం స్వయంగా సినిమా ప్రపంచంలోకి ప్రవేశించి సినిమా చూసిన ఫీలింగుతో థియేటర్ నుండి బయటకు వచ్చే రోజులు దగ్గర్లనే ఉన్నాయి.
తాజాగా హైపర్ మూవీకి సంబంధించి సోషల్ మీడియా ద్వారా 360 డిగ్రీస్ వర్చువల్ రియాల్టీ వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అయింది.
టాలీవుడ్లో చరిత్రలో ఫస్ట్ టైం
ఇప్పటి వరకు టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించి 360 డిగ్రీస్ వర్చువల్ రియాల్టీ వీడియోస్ ఏవీ రాలేదు. అయితే తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలోనే తొలిసారి ‘హైపర్' మూవీకి సంబంధించి వర్చువల్ రియాల్టీ వీడియో రిలీజ్ చేసారు. సినిమాలోని ‘హైపరే' సాంగ్ మేకింగ్ వీడియోను 360 డిగ్రీస్ లో షూట్ చేసి రిలీజ్ చేసారు.
గర్వంగా ఉందన్న నిర్మాతలు
తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారి.... మా హైపర్ మూవీ విషయంలో 360 డిగ్రీస్ వర్చువల్ రియాల్టీ మేకింగ్ వీడియో రిలీజ్ చేయడం గర్వంగా ఉందంటూ నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేసారు.
వారికే అంకితం
తెలుగు పరిశ్రమలో తొలిసారి విడుదలైన ఈ వీడియోను తెలుగు సినిమా పరిశ్రమలో హార్డ్ వర్క్ చేసే వారందరికీ, తెర వెనక ఉండి అద్భుతమైన సినిమాలు ప్రేక్షకులు అందిస్తున్న వారికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.
బాహుబలి-2 కంటే ముందే
ఇటీవల ప్రెస్ మీట్లో రాజమౌళి మాట్లాడుతూ..... తెలుగు సినీ పరిశ్రమలోనే తొలిసారిగా బాహుబలి-2 మేకింగ్ వీడియోలను 360 డిగ్రీస్ వర్చువల్ రియాల్టీలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే అంతకంటే ముందే హైపర్ మూవీకి సంబంధించి 360 డిగ్రీస్ వర్చువల్ రియాల్టీ వీడియో రావడం గమనార్హం.