Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాహుబలి: బిజ్జలదేవగా నాజర్.....(మేకింగ్ వీడియో)
హైదరాబాద్: మహాభారతంలో శకుని పాత్ర ఎలాంటదో....‘బాహుబలి' సినిమాలో బిజ్జలదేవ పాత్ర అలాంటిది. కౌరవులకు పాండవులపై విషం నూరిపోసిన వ్యక్తి శకుని. ఎత్తుకి పైయెత్తులు వేయడంలో శకునిని మించినవారెవరూ వుండరేమో. అలాంటివారినే శకుని అని అంటుంటాం. కానీ, అంతకు మించి.. బిజ్జలదేవ పాత్ర ‘బాహుబలి'లో వుండబోతోంది. బాహుబలిలో ఈ పాత్రను నాజర్ పోషిస్తున్నాడు.
బిజ్జలదేవ పాత్రకు ఒక చేయి చచ్చుబడిపోయి ఉంటుంది. ఇందు కోసం పత్యేకంగా చేయి తయారు చేసి బిజ్జలదేవ పాత్రను షూట్ చేసారు. తాజాగా పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేసారు.
‘బాహుబలి' ఆడియో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. జులై 10న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కోసం దరఖాస్తు చేసుంది. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కానున్నాయి.
ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ లోగా చిత్రం యూనిట్ సైతం ప్రమోషనల్ ఏక్టివిటీస్ పెంచేసింది. భారతీయ చిత్ర పరిశ్రమలో రూ. 250 కోట్ల అత్యంత భారీ వ్యయం రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. కీరవాణి సంగీతం అందించారు.