»   » రజనీకాంత్ రోబో ‘2.0’ మేకింగ్ వీడియో....

రజనీకాంత్ రోబో ‘2.0’ మేకింగ్ వీడియో....

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండియన్ సినిమా చరిత్రలో అతి పెద్ద మూవీ ఇప్పటి వరకు 'బాహుబలి'. త్వరలో మరో భారీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అది మరేదో కాదు.... రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న '2.0'.

గతంలో రజనీ, శంకర్ కాంబినేసన్లో వచ్చిన 'రోబో' చిత్రానికి ఇదీ సీక్వెల్. ఇండియన్ సినిమా చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. 2018లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


వినాయక చవితి సందర్భంగా '2.0' చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. సినిమా షూటింగ్ జరుగుతున్న తీరును ఈ వీడియో ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.

ర‌జ‌నీకాంత్‌ను రోబోగా తీర్చిదిద్దుతున్న విధానం, భ‌యంక‌ర‌మైన రూపంలో క‌న‌ప‌డుతున్న అక్ష‌య్‌ కుమార్ ఈ సినిమాపై ఎంతో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Watch the Making video 2.0. 2.0 is a Science Fiction film featuring "Superstar Rajinikanth" & Akshay Kumar, being directed by Shankar and music by A. R. Rahman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu