భార్యతో ఐటం సాంగ్ చేయించబోతున్న నిర్మాత

By Bojja Kumar

ముంబై: మీరు విన్నది నిజమే. సినిమా నిర్మాతే తన భార్యతో ఐటం సాంగు చేయించబోతున్నాడు. ఆయన మరెవరో కాదు బాలీవుడ్ నిర్మాత, సల్మాన్ ఖాన్ సోదరుడు అయిన అర్భాజ్ ఖాన్. ఐటం సాంగు చేయబోయేది ఆయన భార్య మలైకా అరోరా ఖాన్. అర్భాజ్ ఖాన్ ప్రస్తుతం 'Dolly Ki Doli' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలైకాతో ఐటం సాంగు చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.

ఇంతకు ముందు తన భర్త అర్భాజన్ ఖాన్ నిర్మించిన 'దబాంగ్' చిత్రంలో మలైకా అరోరా ఖాన్ 'మున్ని మదనాం హుయే' ఐటం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన ఐటం సాంగ్ అప్పట్లో సినిమాకు హైలెట్ అయింది. సినిమా విజయంలో ఈ పాట ఎంతో కీలకం అయింది. తాజాగా మరోసారి భర్త కోసం 'Dolly Ki Doli' చిత్రంలో కూడా ఐటం సాంగు చేయబోతోంది మలైకా.

Malaika Arora Khan To Do Another Item Number For Hubby?

దీని గురించి అర్భాజ్ ఖాన్ మాట్లాడుతూ...'మలైకా ఈజ్ మై లక్కీ మస్కట్. తను ఐటం సాంగు చేస్తే మా సినిమాకు మరింత గ్లామర్ లుక్ వస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ నెలలో మలైకాతో స్పెషల్ సాంగ్ చేయించడానికి ప్లాన్ చేస్తున్నాం' అని వెల్లడించారు.

'Dolly Ki Doli' చిత్రానికి రాజ్ కుమార్ రావు దర్శకత్వం వహిస్తుండగా సోనమ్ కపూర్, పుల్కిత్ సామ్రాట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈచిత్రాన్ని నవంబర్ నెలలో విడుదల చేయడమే లక్ష్యంగా షూటింగ్ జరుపుతున్నారు. సినిమా మొత్తానికి హైలెట్ అయ్యే విధంగా మలైకాతో ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X