ఏం చేస్తాం! పవన్ కూడా ఆవిడతోనే?
పవన్ కళ్యాణ్-హారిష్ శంకర్ కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్ చిత్రం' రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈచిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'దబాంగ్' రీమేక్. అప్పట్లో దబాంగ్ చిత్రంలో మున్నీ బదనాం హుయే పాట ఎంత ఫేమస్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. గబ్బర్ సింగ్ లోనూ ఇలాంటి హాట్ సాంగ్ ఒకటి ప్లాన్ చేశారు. ఈ పాట కోసం అనుష్క, పార్వతి మెల్టన్, ఇలియానాలను దర్శక నిర్మాతలు సంప్రదించినా...వారెవరూ ఒప్పుకోలేదనే వార్తలు వినిపించాయి. మామూలు ఐటం గర్ల్ ను పెడతామంటే పెద్దగా వర్కౌట్ కాదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మల్లికా షెరావత్, బిపాస బసులను ట్రై చేశారుకానీ...వారు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. దీంతో చివరకు మున్నీ పాటలకు చిందులేసి బాలీవుడ్ మున్నీ....మలైకా అరోరాతోనే స్టెప్పులేయించడానికి దర్శక నిర్మాతలు నిర్ణయించినట్లు తాజా ఫిల్మ్ నగర్ సమాచారం.
నాగబాబు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణం: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications











