అర్జున్ కపూర్‌కి మలైకా స్పెషల్ బర్త్ డే విషెస్.. 11 ఏళ్ళు చిన్నవాడైనా డేటింగ్‌లో,,

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఎదో ఒక వార్తతో హాట్ టాపిక్ గా నిలిచే జంట అర్జున్ కపూర్ - మలైకా అరోరా. తనకంటే 11 ఏళ్ళు చిన్నవాడైనప్పటికి మలైకా ఆ కుర్ర హీరోను లైన్ లో పెట్టిన విధానం ఇప్పటికి ఒక మిస్టరీనే అని సోషల్ మీడియాలో అనేక రకాల మీమ్స్ వస్తుంటాయి. పైగా ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా అర్జున్ కపూర్ లాంటి యువ హీరో ఆమెను ప్రేమించడం అందరిని ఆశ్చర్యపరిచింది.

వయసుతో సంబంధం లేకుండా

వయసుతో సంబంధం లేకుండా

మలైకా అరోరా అర్జున్ కపూర్ కంటే చాలా ఏళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. వయసుతో సంబంధం లేకుండా తన అందంతో కుర్రాళ్లను ఆకట్టుకుంటూనే ఉంటోంది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో నిత్యం వైరల్ అయ్యేలా చేస్తుంది. కెవ్వుకేక సాంగ్ తో టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కూడా హాట్ స్టెప్పులతో ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలు తగ్గించేసి తనకు నచ్చినట్లుగా జీవిస్తోంది.

కుర్ర హీరోతో ప్రేమాయణం

కుర్ర హీరోతో ప్రేమాయణం

మలైకా అరోరా వయసు 46. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్భజ్ ఖాన్ ను మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత విడాకులు తీసుకుంది. తన కంటే 11 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. గత కొన్నేళ్లుగా అతనితో ఎఫైర్ ని కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఇప్పటివరకు తన ఆలోచనలపై పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు.

బర్త్ డే సందర్భంగా..

బర్త్ డే సందర్భంగా..

ఇక ఇటీవల అర్జున్ కపూర్ బిర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ ఫొటోతో స్వీట్ గా విషెస్ అందించింది. హ్యాపీ బర్త్ డే సన్ షైన్ అంటూ ఆమె చెప్పిన విషెస్ ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక అంతకుముందే ఒక మీడియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ పేరు చెప్పకుండా అతను నా కంటే చిన్నవాడు అయినా కూడా డేటింగ్ లో చాలా గట్టివాడు అంటూ కామెంట్ చేసింది.

Recommended Video

#CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
క్లారిటీ వచ్చేసింది..

క్లారిటీ వచ్చేసింది..

ఇక ప్రస్తుతం బర్త్ డే విషెస్ కూడా చెప్పడంతో వీరి బ్రేకప్ పై వస్తున్న రూమర్స్ కి కూడా బ్రేక్ పడింది. ఆ మధ్య బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ అలాంటి రుమర్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా స్పందించకుండా ఎదో ఒక ఫొటోతో రూమర్స్ కి చెక్ పెడుతున్నారు. ఇక త్వరలో పెళ్లి చేసుకోవడానికి కూడా జోడి సిద్ధమవుతున్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ విషయంపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X