పవన్ కళ్యాణ్ ఐటం గర్ల్‌గా శృంగార లేడీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'గబ్బర్ సింగ్' చిత్రంలో ఆడిపాడే ఐటం గర్ల్ ఎట్టకేలకు కన్ ఫర్మ్ అయింది. ఈ ఐటం సాంగు కోసం ఇప్పటి వరకు చాలా మందిని సంప్రదించారు. చివరకు సెక్సీ భామ మలైకా అరోరాని ఖరారు చేశారు. ఈవిషయాన్ని ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ కన్‌ఫర్మ్ చేశారు. గబ్బర్ సింగ్ చిత్రానికి ఒరిజినల్ వర్షన్ అయిన 'దబాంగ్' చిత్రంలో మున్ని బదనాం హుయే సాంగులో బాలీవుడ్ ప్రేక్షకుల మతులు పోగొట్టిన మలైకా...తాజాగా పవన్ స్టార్‌తో స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకుల్లోనే వేడి పుట్టించనుంది. గతంలో మలైకా మహేష్ బాబు సరసన అతిథి చిత్రంలో 'రాత్రైనా, పగలైనా నాకు ఒకే' అంటూ హాట్ హాట్ అందాలు ఆరబోసింది.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ కొండవీడు పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. పవర్ స్టార్ సరసన శృతి హాసన్ భాగ్యలక్ష్మి పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, నాగినీడు, సుహాసిని, బ్రహ్మానందం, అలి, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రం హిందీ దబాంగ్ చిత్రానికి రీమేక్ అయినా...తెలుగు నేటివిటీకి తగిన విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఆడియో, మే 9న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











