ఆటో నడుపుతూ మాలాశ్రీ
బెంగళూరు : తొంభైలలో విడుదలైన ప్రేమఖైదీ, పరువు ప్రతిష్ట, బావా బావమ్మర్ది.. వంటి ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకులకు చేరువైన మాలాశ్రీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఆమె కన్నడ నిర్మాత రాము ని వివాహం చేసుకుంది. అయితే నటనకు మాత్రం దూరం కాలేదు. ఇప్పుడు సైతం ఆమె ప్రధాన పాత్రలో చిత్రాలు రూపొందుతున్నాయి.
తాజాగా మాలాశ్రీ 'గంగ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఆటో డ్రైవర్ పాత్రలో మాలాశ్రీ కనిపిస్తుంది. యాక్షన్, సెంటిమెంట్ ప్రధానంగా ఉంటాయి. ఇందులో ఐదు పాటలున్నాయి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
మాలాశ్రీ, శ్రీనివసమూర్తి, రంగాయణ రఘు, బులెట్ ప్రకాష్, సాధుకోకిలా, ఎం.ఎన్.లక్ష్మీదేవి, పవిత్రాలోకేష్, శరత్ లోహితాశ్వ, హేమాచౌదరి ప్రధాన తారాగణం. మాటలు- అనిల్‌కుమార్, ఫోటోగ్రఫీ- రాజేష్ కట్టి, సంగీతం- అర్జున్ జన్య, దర్శకత్వం- ఓంసాయి ప్రకాష్.
రీసెంట్ గా ...మాలాశ్రీని చెంపేస్తామని బెదిరించారని బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తన మొబైల్ కు ఈ నెల 24వ తేదిన చెన్నయ్ కి చెందిన ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి మేము చెప్పినట్లు వినకపోతే నీ ప్రాణాలు తీస్తామని బెదిరించారని మాలాశ్రీ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మాలాశ్రీకి చెన్నైలో అపార్ట్మ్ంట్స్ ఉన్నాయి.

ఈ అపార్ట్మెంట్స్ బాగోగులు చూసుకొవడానికి ఒకరిని నియమించారు. ఈ పనులు చూసుకొవడానికి అతనికి మాలాశ్రీ నెలకు రూ. రెండు లక్షలు ఇచ్చే వారు. ఇటివల మాలాశ్రీ ఆపార్ట్‌మెంట్స్‌ను విక్రయించారు. ఈ సందర్బంలో అపార్ట్మెంట్స్ నిర్వహణల భాద్యతలు చూసుకుంటున్న అతను మరొ వ్యక్తితో కలిసి మాలాశ్రీని సంప్రందించారు.
అపార్ట్‌మెంట్స్‌ను విక్రయించిన సోమ్మలో తమకు భాగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు మాలాశ్రీ నిరాకరించడంతో ప్రాణాలు తీస్తామని బెదిరించారని పోలీసులు తెలిపారు. మాలాశ్రీని బెదిరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నటి మాలాశ్రీ తెలుగులో ప్రేమఖైధి, అల్లరి పోలీసు, ఆంధ్ర కిరణ్ బేడి, బంగారు మొగుడు, బావ బావమరిది, చాముండి, ఘరాన అల్లుడు, మన్మద సామ్రాజ్యం, నీ ప్రేమకై తదితర చిత్రాలలో నటించారు.
సుమన్ తో కలిసి మాలాశ్రీ ఎక్కువ సినిమాలలో నటించారు. కన్నడలో ఒక్క వెలుగు వెలిగిన మాలాశ్రీ నెంబర్ వన్ స్థానానికి చేరుకునింది. కన్నడలో లేడి అమితాబ్ బచ్చన్ అని పేరు తెచ్చుకుని యాక్షన్ సినిమాలు చేసింది. మాలాశ్రీ కన్నడలో నటించిన అనేక సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ చేశారు. కన్నడలో భారీ చిత్రాలు నిర్మిస్తున్ననిర్మాత రామును మాలాశ్రీ వివాహం చేసుకునింది. ప్రస్తుతం మాలాశ్రీ నాలుగు సినిమాలలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











