'శక్తి' చిత్రమే 'బొమ్మాళి' అంటూ వెంబడిస్తోంది

By Srikanya

అప్పట్లో ఇవివి సత్యనారాయణ చిత్రం ప్రేమ ఖైదీతో పరిచయమైన మాలాశ్రీ. చిరకాల విరామం తర్వాత తెలుగు తెరపై కనిపిస్తోంది. ఆమె నటించిన కన్నడ చిత్రం తెలుగులోకి డబ్ అవుతోంది. సాయిరవి కీలక పాత్రధారి గా మాలాశ్రీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బొమ్మాళి'. కన్నడలో రూపొందిన 'శక్తి' చిత్రం తెలుగులో 'బొమ్మాళి' పేరుతో అనువాదమవుతోంది. 'నిన్ను వదల' అనేది ట్యాగ్ లైన్.

లక్ష్మీ ప్రణవ్ ప్రొడక్షన్స్ పతాకంపై రాము ఎంటర్‌ప్రైజెస్ సమర్పిస్తున్నారు. ఆకుల విజయ నిర్మాత. ఆయన మాట్లాడుతూ "కన్నడలో 350 కేంద్రాల్లో విడుదలైంది. 50 రోజులు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. యాక్షన్‌తో పాటు గ్రాఫిక్ ప్రత్యేక ఆకర్షణగా తెరకెక్కుతోంది. మాలాశ్రీ, సాయిరవి నటన హైలైట్. డబ్బింగ్ మొదలుపెట్టాం. ఇదే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇందులో అద్భుతమైన నాలుగు పాటలున్నాయి. తెలుగులో ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తాం'' అని చెప్పారు.

సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, శ్రావణ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: వెన్నెలకంటి, సంగీతం: వర్ధన్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, థ్రిల్లర్ మంజు, సమర్పణ: రాము ఎంటర్‌ప్రైజెస్, నిర్మాత: ఆకుల విజయ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనిల్‌కుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X