బాలయ్య సినిమా టికెట్ కోసం మర్డర్ చేసిన తప్పేమీ లేదు.. తిరగబడరా సామి అంటూ హీరోయిన్ షాకింగ్‌గా
యువ హీరో రాజ్ తరుణ్, తెలుగు సినిమాకు పరిచయం అవుతున్న యువ హీరోయిన్ మాల్వి మల్హోత్రా జంటగా నటిస్తున్న యాక్షన్, రొమాంటిక్, ఎంటర్‌టైనర్ తిరుగబడరా సామి. ఈ సినిమాను నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. పలు సంచలన చిత్రాలను తీసిన ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మంచి క్రేజ్ పుంజుకొంటున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మాస్, మసాల అంశాలతో రూపొందించిన ఈ టీజర్ గురించిన వివరాల్లోకి వెళితే..
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం తన రూట్ మార్చి కొత్త గెటప్, సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో సిద్దమైనట్టు తిరగబడరా సామి సినిమా టీజర్ స్పష్టం చేసింది. లుక్, క్యారెక్టర్ పరంగా యాటిట్యూడ్ ఆకట్టుకొనేలా ఉంది. అయితే రెండు విభిన్నమైన కోణాలు ఉన్న పాత్రలో రాజ్ తరుణ్ కనిపించడమే కాకుండా మరోసారి విజయాన్ని దక్కించుకొనేందుకు ప్లాన్ చేసినట్టు కనిపించింది. సాధారణ మధ్య తరగతి ఫ్యామిలీ మ్యాన్‌గా, అలాగే ప్రియురాలితో రొమాంటిక్ లవర్ బాయ్‌లా హాట్ హాట్ సీన్లలో మెప్పించారు.

తిరుగబడరా సామి సినిమా టీజర్ చూస్తే.. దర్శకుడు ఏఎస్ రవికుమార్ మంచి కసి మీద సినిమా తీసినట్టు కనిపిస్తున్నది. కత్తులుతో యాక్షన్, రాజ్ తరుణ్, మాళవిక మల్హోత్ర మధ్య హాట్ సన్నివేశాలు, అలాగే బాలయ్య అభిమానులను ఆకట్టుకొనే డైలాగ్స్ ఈ సినిమా ట్రైలర్‌కు ప్లస్ పాయింట్‌గా కనిపించాయి. బాలయ్య సినిమా కోసం మర్డర్ చేసినా తప్పు లేదు గిరి.. అంటూ హీరోయిన్ చెప్పడమే కాకుండా మంచి ఫైట్స్‌తో ఇరుగదీయడం ఆకట్టుకొనేలా ఉంది.

ఇక తిరుగబడరా సామీ మూవీలో విలన్ పాత్రను పరిచయం చేస్తూ ఇది నా సామ్రాజ్యం. అందరూ గంజాయి వనం అంటున్నారని.. ఒక తులసి మొక్కను నాటను. అది ఇప్పుడు కనబడటం లేదు. ఆ తులసి మొక్కను తీసుకు రావాలి అంటూ విలన్ మకరంద్ దేశ్ పాండే చేత చెప్పిన డైలాగ్స్ సినిమా కంటెంట్ ఏమిటో చెప్పకనే చెప్పింది.

ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా తిరుగబడరా సామి సినిమాలో ఉన్నాయనే విషయాన్ని ప్రగతి, రాజ్ తరుణ్ మధ్య సన్నివేశాలతో చూపించారు. ప్రాణం అంటే భయపడే వాడితో నీకు కాపురం ఎందుకు అని ప్రగతి ప్రశ్నించడం.. రాజ్ తరుణ్ మౌనంగా తల దించుకొని కనిపిస్తాడు.. ఆ తర్వాత ఫుల్ యాక్షన్ సీన్‌లో తన క్యారెక్టర్‌ను ఫుల్ ఎలివేట్ చేసి.. తులసి మొక్కను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. మాస్, మసాల అంశాలతో తిరుగబడరా సామి టీజర్ అంచనాలు పెంచింది.
నటీనటులు: రాజ్ తరుణ్, మాళవిక మల్హోత్రా, ప్రగతి, మకరంద్ దేశ్ పాండే, జబర్దస్త్ అప్పారావు, రాజా రవీంద్ర తదితరులు
దర్శకత్వం: ఏఎస్ రవికుమార్ చౌదరీ
సినిమాటోగ్రఫి: జవహర్ రెడ్డి ఎంఎన్
మ్యూజిక్ డైరెక్టర్: జేబీ, భోలే షవాలీ
ఆర్ట్ డైరెక్టర్: రవికుమార్ గుర్రం
బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీడియా


Click it and Unblock the Notifications











