తెలుగు నిర్మాతపై మాళవిక కంప్లైంట్

ఆమె ఆరోపణల్ని నిర్మాత ముత్యాల ఆంజనేయులు ఖండించారు. అంతేకాదు, షూటింగులో పాల్గొనకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఆమెపై కోర్టులో 75 లక్షల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నానని చెప్పారు. "ఆమె చేస్తున్న ఆరోపణ అసత్యం, నిరాధారం. సినిమాలో తను చేయాల్సిన సన్నివేశాలు చేయకుండా ఇబ్బంది పెడుతోంది. దానివల్ల నా షూటింగుకు అంతరాయం కలుగుతోంది. అందుకే ఆమె ఆరోపణల్ని కోర్టులోనే సవాలు చేయబోతున్నా. పరిహారాన్నీ కోరతా" అని ఆయన తెలిపారు.
"ఆ సినిమా చేయనని నేను చెప్పడం లేదు. అందువల్ల ఏ కోర్టులోనైనా దాన్ని నేను ఎదుర్కొంటా" అని మాళవిక స్పష్టం చేసింది. నిర్మాత వ్యవహారంపై ఆమె ఇప్పటికే శరత్‌కుమార్ అధ్యక్షుడిగా వున్న సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసింది.


Click it and Unblock the Notifications











