»   » నిర్మాత సురేష్ బాబు తాత అయ్యాడు!

నిర్మాత సురేష్ బాబు తాత అయ్యాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నిర్మాత సురేష్ బాబు తాతయ్య గా ప్రమోషన్ పొందారు. సురేష్ బాబు కూతురు, రానా దగ్గుబాటి సిస్టర్ మాలవిక దేవి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ కుటుంబంలోకి లిటిల్ గర్ల్ రావడంతో దగ్గుబాటి ఫ్యామిలీ ఆనందంలో మునిగి పోయింది.

మాళవిక వివాహం బిజినెస్ మేన్ భరత్ కృష్ణతో డిసెంబర్ 5, 2012న జరిగింది. హైదరబాద్ నానక్ రాం గూడలోని రామానాయుడు స్టూడియో ఈ వివాహ మహోత్సవం వైభవంగా జరిగింది.

Malavika Devi has given birth to a baby girl

మాళవిక దేవి..... లక్ష్మి- సురేష్ బాబు దంపతుల కూతురు, రాజేశ్వరి- రామానాయుడుల మనవరాలు. భరత్ కృష్ణ...పద్మావతి- రాజా మోహన్ రావు పొట్లూరి కుమారుడు. చిత్తూరు వాస్తవ్యులైన భరత్ కుటుంబం బెంగుళూరులో సెటిల్ అయ్యారు. వారికి సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. మాలివిక మేనేజ్‌మెంట్ కోర్సులో గాడ్యుయేషన్ పూర్తి చేసింది కార్వీ కన్సల్టెన్సీలో ఉద్యోగం చేసింది. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసింది. వెంకటేష్ వైఫ్ నీరజ అంకుల్ ఈ సంబంధం కుదిర్చారు.

English summary
Veteran producer Suresh Babu's daughter and actor Rana Daggubati's sister Malavika Devi has given birth to a baby girl at a private hospital earlier today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu