చాలా బాగుంది సినిమాతో తెలుగువారికి పరిచయమైన మళయాళ భామ మాళవిక ఆ మద్య పెళ్ళి చేసుకుంది. సుమేష్ మీనన్ అనే ముంబయికి చెందిన పారిశ్రామిక వేత్తతో ఆమె జీవితం ప్రశాంతంగా గడుపుతోంది. ఇప్పుడా దంపతులు ఇద్దరూ తల్లి,తండ్రి అయ్యారు. ఈ నవంబర్ ఇరవై అయిదున ముంబయిలోని లీలావతి హాస్పటిల్ లో మాళవిక ఓ ఆరోగ్యవంతమైన బాబుకి జన్ననిచ్చింది. సుఖ ప్రసవమయ్యిందని,ఆపరేషన్ పడుతుందేమోనని ఏర్పాట్లు చేసుకున్నామని,అయితే ఆ అవసరం రాలేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తల్లి,బిడ్డ ఆరోగ్యంగా,క్షేమంగా ఉన్నారని ఆ బాబుకి ఆరోవ్ మీనన్ అనే పేరు పెడుతున్నారని ఆమె భర్త మీడియాకు తెలియచేసారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. అలాగే మధ్యలో ఆగిన చిత్రాలను ఫినిష్ చేయాల్సి ఉంది. అయితే డాక్టర్స్ సూచన మేరకు కొంతకాలం ఆమె ఆగుతుందని మాళవిక భర్త చెప్తున్నారు.