twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహానటి: సావిత్రి సవితి పాత్రలో కనిపించే హీరోయిన్ ఈవిడే...

    By Bojja Kumar
    |

    సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'మహానటి'లో హీరోయిన్ మాళవిక నాయర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తన మొదటి సినిమా 'ఎవడే సుబ్రహ్మణ్యం'‍‌లో హీరోయిన్‌గా చేసిన మాళవిక‌ను ఇపుడు 'మహానటి'లో ఓ ముఖ్యమైన పాత్రకు ఎంపిక చేశాడు నాగ్ అశ్విన్. ఇందులో ఆమె జెమినీ గణేశన్ మొదటి భార్య, సావిత్రి సవితి పాత్ర 'అలిమేలు'గా కనిపించబోతోంది. నాని వాయిస్ ఓవర్‌ ద్వారా ఆమె పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఓ ఇంట్రో వీడియో విడుదల చేశారు.

    అలిమేలు, జెమినీ గణేశన్ మొదటి భార్య. సావిత్రికి అక్కలా ఆప్యాయతను పంచడమే కాకుండా, తన కూతురికి తల్లిలా కన్యాదానం చేసిన మేటి ఇల్లాలు. ఈ పాత్రలో ఒదిగిపోయింది మన మాళవిక నాయర్..... అంటూ నాని వాయిస్ ఓవర్‌తో ఇంట్రో వీడియో విడుదల చేశారు.

    మహానటి' చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో నటిస్తుండగా దుల్కర్ సల్మాన్ సావిత్రా భర్త జెమినీ గణేశన్‌ పాత్రను పోషించారు. సావిత్రి చిన్నతనం నుండి మహానటిగా ఆమె ఎలా ఎదిగారు అనే విషయాలన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నారు.

    Malavika Nair as Alamelu in Mahanati

    స్టార్ హీరోయిన్ సమంత ఈ మూవీలో జర్నలిస్టు మధురవాణి పాత్ర పోషించారు. ఆమెతో పాటు ఉండే ప్రెస్ ఫోటోగ్రాఫర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. వీరితో పాటు ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, శాలిని పాండే, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న "మహానటి" చిత్రాన్ని దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నాడు. ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

    ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్.

    English summary
    Here is the Character Intro of Malavika Nair as Alamelu in #Mahanati. The greatest story ever told about the greatest actress that ever lived. It is such a privilege to make a biopic of the one and only Mahanati Savitri, an iconic actress we were ever blessed with. Mahanati is an ode to the great soul that etched a special place in all our hearts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X