రూమర్లకు షాక్.. వైభవంగా భావన, నవీన్ పెళ్లి.. (ఫొటోలు)
Recommended Video

మలయాళ నటి భావన, కన్నడ నిర్మాత నవీన్ వివాహం ఘనంగా జరిగింది. కేరళలోని త్రిసూరులో సోమవారం (22 జనవరి)న తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వారిద్దరూ ఒక్కటయ్యారు. భావన, నవీన్ వివాహం త్రిసూర్‌లోని జవహర్‌లాల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆడంబరంగా జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం..

హిందూ సంప్రదాయం ప్రకారం
మీడియా కథనం ప్రకారం.. త్రిసూర్‌లోని తిరువంబదీ ఆలయంలోని వివాహా వేదికపై సోమవారం ఉదయం 9.30 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. పెద్దలు నిర్ణయించిన ముహుర్తం ప్రకారం భావన మెడలో నవీన్ మూడుమూళ్లు వేశారు.

పెళ్లి డ్రెస్‌లో మెరిసిన భావన
బంగారుపూత రంగు ఉన్న చీరను ధరించిన భావన మెరిసిపోయింది. ఆమె ధరించిన చీర బంగారంతో తయారు చేయడం గమనార్హం. పెళ్లికూతురు డ్రెస్‌లో అందంగా ముస్తాబైన భావన అందర్ని ఆకట్టుకొన్నది. చెవికి రింగులు, నెక్లెస్, ఆకర్షణీయమైన గాజులు ధరించింది. మలెపూలతో ఆమె జడను ప్రత్యేకంగా అలంకరించారు.

ఘనంగా మెహందీ ఫంక్షన్
పెళ్లి కార్యక్రమంలో భాగంగా ఆదివారం మెహందీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పసుపు రంగు డ్రెస్‌తో ధగధగలాండింది. ఆమె స్నేహితురాళ్లు, సన్నిహితులతో కబుర్లు ఆడుతూ ఆనందంగా కనిపించింది.

సన్నిహితుల సమక్షంలో
భావన పెళ్లి హంగులు ఆర్భాటాలకు తావివ్వకుండా కుటుంబ కార్యక్రమంగా నిర్వహించారు. ఈ పెళ్లికి అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

విందుకు ఏర్పాట్లు
త్రిసూరులోని లులూ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలు హాజరుకానున్నారు.

మార్చిలో ఎంగేజ్‌మెంట్
భావన, నవీన్ నిశ్చితార్థం మార్చి మాసంలో జరిగింది. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

ప్రేమగా మారిన పరిచయం
నాలుగేళ్లుగా నవీన్, భావన ప్రేమ వ్యవహారం నడుస్తున్నది. వారిద్దరు రోమియో సెట్లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. వారి పరిచయం ప్రేమగా మారింది. దాదాపు వారి రిలేషన్‌ను రెండేళ్లపాటు గోప్యంగా ఉంచారు.

తగరు చిత్రంలో
భావన నటించిన కన్నడ చిత్రం తగరు విడుదలకు సిద్ధంగా ఉంది.
ప్రియాంక చోప్రా గిఫ్ట్
భావన పెళ్లికి బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా సర్ఫ్రైజ్ గిఫ్టును అందించింది. ఓ వీడియో సందేశాన్ని పంపించింది వివాహా శుభాకాంక్షలు తెలిపింది. ఆ వీడియోను ఇన్స్‌టాగ్రామ్ వెబ్‌సైట్లో పోస్ట్ చేసింది.

జీవితంలో గొప్ప మలుపు
భావన హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నీ జీవిత ప్రయాణంలో ఇదో గొప్ప మలుపు. వైవాహిక జీవితంలో నీకు అంతా మంచే జరుగాలని కోరుకొంటున్నాను. నీవు చాలా ధైర్యవంతురాలివి. నీవంటే నాకు ఎంతో స్ఫూర్తి అని ప్రియాంక వీడియో సందేశంలో పేర్కొన్నారు.

గాసిప్స్‌కు చెక్
భావన, నవీన్ పెళ్లి వాయిదా పడిందని కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు షికారు చేశాయి. వ్యక్తిగత కారణాల వల్ల వారు పెళ్లి రద్దు చ చేసుకొన్నారని వార్తలు వచ్చాయి. అలాంటి రూమర్లకు చెక్ పెడుతూ భావన, నవీన్ సోమవారం పెళ్లి చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











