twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరీ ఇంత కక్కుర్తి ఏంటో?... ఆ హీరో ఎందుకు అరెస్టయ్యాడో తెలుసా?

    By Bojja Kumar
    |

    సినిమా స్టార్ల సంపాదన కోట్లలో ఉంటుంది. ఆ మాత్రం సంపాదన ఉన్నవారు లగ్జరీ కార్లు కొనడం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఓ హీరో తను కొన్న కారుకు ప్రభుత్వానికి పన్ను కట్టడానికి కక్కుర్తి పడి అరెస్టయిన సంఘటన సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది.

    ఎవరా హీరో?

    ఎవరా హీరో?

    ఆ హీరో పేరు పహాద్ ఫాజిల్. మలయాళ చిత్ర సీమకు చెందిన నటుడు. ఇతగాడు ఇటీవల రూ. 20 లక్షలకుపైగా విలువగల లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. అయితే 20 శాతం పన్ను కట్టడానికి కక్కుర్తి పడి అడ్డదారులు తొక్కడంతో అరెస్టయ్యాడు.

    అరెస్టు కావడానికి కారణం?

    అరెస్టు కావడానికి కారణం?

    పహాద్ ఫాజిల్ అరెస్టు కావడానికి కారణం నకిలీ పత్రాలు సృష్టించడమే. ఇతడిగా వ్యవహారంపై ఆరా తీసిన పోలీసులు నకిలీ పత్రాలతో ప్రభుత్వాన్ని మోసం చేసి పన్ను ఎగ్గొట్టాడని తెలిసి ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్టు చేశారు.

    ఎలా దొరికిపోయాడు?

    ఎలా దొరికిపోయాడు?

    కేరళ నివాసి అయిన పహాద్ ఫాజిల్... కారు కొనడానికి తన సొంత రాష్ట్రంలో లోన్ తీసుకున్నాడు. అయితే కేరళ చట్టాల ప్రకారం అక్కడ 20 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కారు కొంటే 20 శాతం పన్ను చెల్లించాలి. పన్ను ఎగ్గొట్టడానికి పహాద్ ఫాజిల్ తన కారును కేంద్ర పాలితప్రాంతమైన పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇందుకోసం తాను పాండిచ్చేరి వాసిగా నకిలీ పత్రాలు క్రియేట్ చేయడంతో దొరికిపోయాడు.

    అరెస్టు, 50 వేల పూచికత్తుతో బెయిల్

    అరెస్టు, 50 వేల పూచికత్తుతో బెయిల్

    పహాద్ ఫాజిల్ నకిలీ డాక్యుమెంట్స్‌తో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేశాడ‌ని, ఈ రోజు అరెస్టు చేసి బెయిల్‌పై విడుద‌ల చేశామ‌ని పోలీసులు తెలిపారు. ఇందుకోసం రూ.50 వేల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల నుంచి షూరిటీ తీసుకున్న‌ట్లు వివ‌రించారు.

    అమలా పాల్ కూడా ఇలాంటి వివాదంలో

    అమలా పాల్ కూడా ఇలాంటి వివాదంలో

    కొన్ని రోజుల క్రితం హీరోయిన్ అమలా పాల్ కూడా ఇలాంటి వివాదంలోనే ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అయితే అమలా పాల్ అరెస్టు అయితే కాలేదు. ఇపుడు ఇలాంటి కేసులోనే పహాద్ ఫాజిల్ అరెస్టు కావడం మలయాళం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది.

    English summary
    Malayalam actor Fahadh Faasil was arrested here today and later released on bail in connection with registration of his luxury vehicle in Puducherry using "forged" documents.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X